మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడ్‌న్యూస్.. పెన్షన్లు, రేషన్ కార్డులు, త్వరలో ప్రక్రియ ప్రారంభం: మంత్రి హరీశ్ రావు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు చేస్తామని ప్రకటించింది. వచ్చే రెండు నెలల్లో అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. అర్హత కలిగిన వారికి రేషన్ కార్డులను సైతం మంజూరు చేస్తామని ప్రకటించారు. ఒకటి రెండు నెలల్లో ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.

వారికి కూడా రుణం

వారికి కూడా రుణం


సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని అనుకునే వారికి రుణాలు మంజూరు చేస్తామని మంత్రి హరీశ్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం సంపద పెంచి పేదలకు పంచుతుంటే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం పేదలను దోచుకుని కార్పొరేట్లకు పంచుతోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి.. దేశంలో బీజీపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా జరగలేదన్నారు.

సిటీలో ఉండి కామెంట్స్

సిటీలో ఉండి కామెంట్స్


గోదావరి చరిత్రలోనే భారీ వరదలు సంభవిస్తే.. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ప్రజలను రక్షించామని వివరించారు. బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ఉండి బురద రాజకీయం చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 29 లక్షలమందికి మాత్రమే పెన్షన్ ఉండేవని గుర్తు చేశారు. అప్పట్లో పెన్షన్ 200, 500 ఉండేదన్నారు. ఆ తర్వాత పెన్షన్ల సంఖ్య 40 లక్షలకు పెరగగా.. పెన్షన్ మొత్తం రూ.2వేలు అయిందన్నారు. తర్వాత ఇంకా పెరిగి రూ.3 వేలైందని తెలిపారు.

 రూ.10 వేల కోట్లు

రూ.10 వేల కోట్లు


ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం పెన్షన్లకు 800 కోట్లు ఖర్చుపెడితే.. తెలంగాణ రాష్ట్రంలో 10 వేల కోట్లు పెన్షన్లకు ఖర్చవుతుందని తెలిపారు. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం అని వివరించారు. కానీ కొందరు విమర్శించడానికే సమయం కేటాయిస్తారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.

English summary
new pensions and ration cards process starts soon telangana minister harish rao said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X