హమ్మయ్య.. ఇప్పుడు స్వేచ్చ వాయువులు, విముక్తి కలిగింది, కేసీఆర్‌పై ఈటల

హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపు ఇచ్చిన బూస్టింగ్‌తో బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ లక్ష్యంగా విమర్శలకు మరింత పదును పెట్టారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. మెదక్‌ జిల్లాతో తనకు అనుబంధం ఉందని వివరించారు. మే రెండు నాడు చిల్లర రాజకీయంతో నన్ను కేసీఆర్‌ బయటకు పంపించాడని.. తనను బయటకు పంపిన సమయంలోనే బానిసత్వం నుంచి విముక్తి పొందానని వివరించారు.

అధికారంలో లేకపోతేనే సుఖం, శాంతి, సంతోషం లభిస్తుందని ఈటల రాజేందర్ అన్నారు. బానిసత్వం, బానిస మనస్తత్వం రెండు లేని వారు దేనికైన సిద్ధంగా ఉంటారు. గతంలో కేసీఆర్‌కు తమ్ముడయిన ఈటల రాజేందర్‌ ఇప్పుడు దయ్యం ఎట్ల అయ్యిండు?. దేశానికి చైతన్యం అందించిన గడ్డ తెలంగాణ. నీ మోసాలకు త్వరలో చరమగీతం పాడతారు.

bjp leader etela rajender critisizes cm kcr. now iam free bird he said.

రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలువడనుకుంటే టీఆర్‌ఎస్‌ పార్టీకి కర్ర కాల్చి వాతపెట్టాడు. దుబ్బాక తెలంగాణకు చైతన్యం తెచ్చింది. మానవత్వం లేని వ్యక్తి, మానవ సంబంధాలను మార్చేసిన వ్యక్తి కేసీఆర్‌. గతంలో నీవు ఎట్ల ఏడ్చినవో నేను గట్లనే ఏడ్చిన. కానీ నువ్వు బానిసవ్ నేను భరిగీసి కొట్లాడినా. అంబేద్కర్ ఇచ్చిన హక్కులను ఎవ్వరూ ఆపలేరు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తులు కేసీఆర్‌, హరీష్‌రావులు. ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యే పదవి దానిని నుండి వచ్చించే సీఎం పదవి అది మర్చిపోకు కేసీఆర్‌.

హుజూరాబాద్ ఎన్నికల్లో రూ. 600 కోట్లు ఖర్చు చేసిండ్రు టీఆర్ఎస్ పార్టీ అని వివరించారు. తెలంగాణలో నేడు బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురే కావొచ్చు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని ఈటల రాజేందర్‌ అన్నారు.

ఇటు మరోవైపు వరిధాన్యం కొనలేమని కేంద్రమే రాష్ట్రాలకు లేఖ రాసిందని అంతకుముందు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేసీఆర్ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వంటి ప్రధాన పార్టీలను గట్టిగా ఎదుర్కొన్న ఘనత ఆయనదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వివరించారు.60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. వారేం చేయలేదని గుర్తుచేశారు. కానీ ప్రభుత్వంపై మాత్రం విమర్శలు చేస్తారని ఫైరయ్యారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆ పార్టీ కారణం కాదా అని అడిగారు.

కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, కరెంట్ షాక్‌లు, రైతు ఆత్మహత్యలు ఉండేవని దుయ్యబట్టారు. కామారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తరలిస్తాం అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు 10 రేట్లు పెంచామని గుర్తుచేశారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళకు దేశంలో తొలిసారిగా పింఛన్లు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. పైకి సుద్దులు మాత్రం చెబుతారని ఆయన పేర్కొన్నారు. చేతలు మాత్రం ఉండవని.. ఇవీ అందరికీ తెలుసు అని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+