222.67 కోట్ల ఆస్తి- 61.5 కోట్ల అప్పు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తులివే
మునుగోడు బై పోల్ కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇక ఆస్తుల వివరాలను ప్రకటించడమే మిగిలి ఉంది. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌లో తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో జత చేశారు. దీని ప్రకారం కోమటిరెడ్ రాజగోపాల్ రెడ్డి ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా తేలింది.
కోమటిరెడ్డి తనకు రూ.61.5 కోట్లు అప్పులు ఉన్నాయని కూడా వెల్లడించారు. కోమటిరెడ్డి ఆస్తుల్లో స్థిరాస్తుల విలువ రూ.152.69 కోట్లు కాగా, చరాస్తుల విలువ రూ.69.97 కోట్లుగా పేర్కొన్నారు. తన సతీమణి ఆస్తుల విలువ రూ.52.44 కోట్లుగా కోమటిరెడ్ రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. బై పోల్‌లో రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కోటిశ్వరుడు.. మిగిలిన వారు ఆ స్థాయిలో ఐశ్వర్య వంతులు కాలేరు.

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య పోటీ ఉండనుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఏ మేరకు ప్రభావం చూపనున్నారో చూడాలీ. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య జోరుగా మాటల యుద్ధం జరుగుతోంది. మంత్రి జగదీశ్ రెడ్డి తన విమర్శలకు మరింత పదును పెట్టారు. బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, బండి సంజయ్, వివేక్ కూడా అదేస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఆత్మగౌరవ పోరాటం నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. బీజేపీలో చేరకముందే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో తగిన విలువ దక్కడం లేదని కామెంట్ చేశారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో.. మునుగోడు గడ్డమీద బీజేపీలో చేరారు.












Click it and Unblock the Notifications