ప్రణయ్ హత్య కేసు నిందితుడికి అమృత వ్యక్తిగత సమాచారం: యువకుడిపై కేసు, అరెస్ట్
నల్గొండ: మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాడంటూ ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంటి ఎదురుగా ఉండే విజయ్ అనే యువకుడు తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసు నిందితుడు కరీంకు చేరవేస్తున్నాడని తన ఫిర్యాదులు అమృత పేర్కొంది.

అమృత ఫిర్యాదు మేరకు యువకుడి అరెస్ట్
ఈ నేపథ్యంలో విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఏడాది క్రితం దారుణ హత్యకు గురైన ప్రణయ్ కేసులో కరీం నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రణయ్ హత్యకేసు విచారణలో ఉంది. కాగా, ఇటీవల అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

తండ్రి కోరిక మేరకు తల్లి వద్దకు అమృత
కాగా, తండ్రి కోరిక మేరకు అమృత తాజాగా ఆమె తల్లిని కలిసింది. గత శనివారం సాయంత్రం తన తల్లి గిరిజను ఆమె నివాసానికి వెళ్లి కలిసింది అమృత. కాగా, తండ్రి అంత్యక్రియల సందర్భంగా కడసారి చూసేందుకు వచ్చిన అమృతను వారి కుటుంబసభ్యులు, స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపించారు. దీంతో తండ్రిని చివరిసారి కూడా చూడకుండానే అమృత వెనుదిరిగి వెళ్లిపోయారు.
Recommended Video

ఇటీవలే మారుతీరావు ఆత్మహత్య
అయితే, మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు అమృతను తల్లి గిరిజ వద్దకు వెళ్లమని లేఖ రాశారు. ‘గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా' అని మారుతీరావు లేఖ రాసిపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసుల రక్షణలో అమృత తన తల్లి గిరిజను వారి నివాసంలో కలిసి పరామర్శించింది. తనకు ఇష్టం లేని వివాహం చేసుకుందనే కోపంతో అమృత భర్త ప్రణయ్‌ను ఏడాది క్రితం మారుతీరావు కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాశ్చాత్తాపంతో మారుతీరావు కూడా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications