మునుగోడులో త్రిముఖ పోరు, విజయంపై బీజేపీ- టీఆర్ఎస్ టెన్షన్ టెన్షన్
మునుగోడు బై పోల్ సమీపిస్తోంది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఇటీవల గుర్తు వివాదం, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చినా.. నేతలు మాత్రం తమ ప్రచారం ఆపడం లేదు. అయితే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉండనుంది. కానీ ఆ రెండు పార్టీలు.. విజయంపై ధీమాగా లేకపోతున్నాయి. బయటకు గెలుస్తామని చెబుతోన్న.. లోన మాత్రం కాస్త భయంగానే ఉన్నాయి.

త్రిముఖ పోటీ..
మునుగోడులో పోటీ టీఆర్ఎస్- బీజేపీ మధ్య పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు మాత్రం గెలుపుపై విశ్వాసంతో లేరు. స్వల్ప మెజారిటీతో గెలుస్తామని టీఆర్‌ఎస్ నేతలు అంటుండగా, గట్టెక్కుతామని బీజేపీ నేతలు ఇంటర్నల్‌గా చెబుతున్నారు. డబ్బు ఇచ్చిన వారికే ఓటేస్తామని కొందరు ఓటర్లు చెబుతుండటంతో.. బై పోల్ విజయాన్ని డబ్బే నిర్ణయిస్తోందని అర్థం అవుతుంది.

బుజ్జగింపుల పర్వం
టీఆర్‌ఎస్, బీజేపీ కులాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి, ఆయా వర్గాలను బుజ్జగించే పనిలో ఉన్నాయి. పద్మశాలీ, గౌడ, గొల్ల కురుమ కుల సమావేశాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సిటీ బస్సుల్ని మునుగోడు గ్రామాలకు తీసుకువచ్చి వాటిలో ఆయా వర్గాల వారిని సమావేశాలకు తరలిస్తున్నాయి. రోజూ ప్రతి గ్రామంలో ఏదో ఒక కులంవారు ఓ సమావేశానికి హాజరవుతున్నారు.

కులాల వారీగా సమావేశాలు
ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న రైతులు, వృద్ధుల్లో టీఆర్‌ఎస్ పట్ల సానుకూలత కనిపిస్తోంది. కొన్ని కులవృత్తుల వారిలో బీజేపీ పట్ల అనుకూలత కనిపిస్తోంది. సంస్థాన్ నారాయణపురం, గట్టుప్పల్ వంటి మండల్లాల్లో ఉన్న పద్మశాలీల్లో బీజేపీ కొంత బలంగా ఉన్నట్టు అనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ బలంగా ఉండగా మండల కేంద్రాల్లో మాత్రం బీజేపీ టీఆర్‌ఎస్‌కు దీటుగా, అక్కడక్కడ మెరుగ్గా ఉన్నట్లు అర్థమవుతోంది. మిడిల్ ఏజ్, వృద్ధులు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉన్నారు. యూత్ మాత్రం బీజేపీవైపు చూస్తోంది.

మీటింగ్‌కు వస్తే కూడా.. డబ్బులు
కులాలవారీ సమావేశాలు, దావత్‌లకు హాజరైన వారికి రాజకీయ పార్టీలు రూ.300 నుంచి రూ.500 వరకూ అందజేస్తోందట. ఉప ఎన్నిక చివరి రెండు, మూడు రోజు ల్లో డబ్బు పంపిణీ చేయాలని భావిస్తున్నాయని తెలిసింది. గత ఎన్నికల్లో తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసే ఓటర్లు ఎక్కువ శాతం, డబ్బిచ్చిన పార్టీకి ఓటేసేవారు తక్కువ శాతం ఉండేవారు. మునుగోడులో డబ్బు ఆశించే ఓటర్ల సంఖ్య బాగా పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మునుగోడులో 2.4 లక్షల ఓట్లుండగా.. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే రెండు లక్షల ఓట్లకు పైగానే పోలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి నిమిషంలో జరిగే డబ్బు పంపిణీ, ప్రలోభాలు ఎక్కువ ఉండటం ఖాయం అనిపిస్తోంది.












Click it and Unblock the Notifications