బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే.. వైఎస్ షర్మిల

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైరయ్యారు. ఆ రెండు పార్టీలు పోటాపోటీగా ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నాయని మండిపడ్డారు. తిరిగి ఏమీ తెలియనట్లు మళ్లీ ధర్నాలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. కరెంట్, రిజిస్ట్రేషన్, మున్సిపల్ పన్నులు పెంచి కేసీఆర్ భారం మోపితే.. పెట్రోల్, గ్యాస్ రేట్లు పెంచి మోడీ గుదిబండ మోపారని మండిపడ్డారు. సుపరిపాలన చేయాలని ఓట్లు వేస్తే.. దగా పాలన చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

ప్రజాప్రస్థానంలో భాగంగా 36వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలం కొండగడప గ్రామంలో షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి పాటిమట్ల, పాటిమట్ల క్రాస్ మీదుగా అడ్డగూడూరు మండలం దాచారం గ్రామంలోకి పాదయాత్ర చేరుకుంది. దాచారంలో మహాత్మా జ్యోతిబా ఫూలే, డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. అనంతరం డి.రేపాక గ్రామానికి పాదయాత్ర చేరుకోగా గ్రామంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. డి.రేపాక నుంచి మంగమ్మగూడెం గ్రామానికి పాదయాత్ర చేరుకుంది.

ఆ రెండు పార్టీలు ఒక్కటే..

ఆ రెండు పార్టీలు ఒక్కటే..

బీజేపీ, టీఆర్ఎస్ ఒకే తాను ముక్కలు అని షర్మిల విరుచుకుపడ్డారు గ్యాస్, పెట్రోల్ రేట్లు పెంచిన బీజేపీ లీడర్లు.. కరెంట్ చార్జీలు పెరిగాయని ధర్నాలు చేస్తున్నారు. కరెంట్, రిజిస్ట్రేషన్. మున్సిపల్ పన్నులు పెంచిన కేసీఆర్.. కేంద్రం వడ్లు కొనడం లేదని ధర్నాలు చేస్తున్నారు. ప్రజల కోసం పనిచేయాలని ఇరు పార్టీలకు అధికారం ఇస్తే.. నువ్వు రెండు పెంచితే నేను నాలుగు పెంచుతా అన్న చందంగా రేట్లు పెంచుకుంటూ ప్రజల నడ్డి విరిస్తున్నారు. పేద ప్రజల రక్త పీలుస్తున్నారు. గ్యాస్, నూనె, కూరగాయల రేట్లు పెరిగి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైయస్ఆర్ పాలనలో మహిళలు స్వయం ఉపాధికి లోన్లు తీసుకుంటే.. కేసీఆర్ పాలనలో మహిళలు అప్పులు తీర్చడానికి లోన్లు తీసుకుంటున్నారు.

మిగతా ఖాళీల సంగతి ఏంటీ

మిగతా ఖాళీల సంగతి ఏంటీ


అసలు వదిలి కొసరు వేసినట్లు ఎనిమిదేండ్లు ఊరిచ్చి ఊరిచ్చి 80వేల ఉద్యోగాలు మాత్రమే ప్రకటించారు. రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే లక్ష ఉద్యోగాలు దాచిపెట్టి, 80వేలు మాత్రమే ప్రకటించారు. కేసీఆర్ హయాంలో మోసపోని వర్గం లేదు. ఇంటికో ఉద్యోగమని మోసం చేశాడు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అని విద్యార్థుల‌ను మోసం చేశాడు. ఉద్యోగం లేక‌పోతే నిరుద్యోగ భృతి ప్రతి నెలా రూ. 3016 ఇస్తాన‌ని మోసం చేశాడు. పేదలకు డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తాన‌ని చెప్పి మోసం చేశాడు. మైనార్టీల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్ ఇస్తామ‌ని మోసం చేశాడు. దళితులకు మూడెక‌రాల భూమి ఇస్తామ‌ని మోసం చేశాడు.

అప్పు పెరుగుతుంది.. కానీ

అప్పు పెరుగుతుంది.. కానీ


కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసినా.. ఫీజు రీయింబర్స్ మెంట్​కు నిధులు ఉండవు. ఆరోగ్యశ్రీకి నిధులు ఉండవు. రుణమాఫీ ఉండదు. మహిళా సంఘాల రుణాలకు వడ్డీలు చెల్లిద్దామన్నా నిధులు ఉండవు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినిట్లు కేసీఆర్ ప్రజలను తాకట్టుపెట్టి అప్పులు తెచ్చి, ఆ అప్పులను మళ్లీ ప్రజలపైనే రుద్దుతున్నాడు. కేసీఆర్‌ను నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దు. ఎన్నికల సమయంలో ఎన్నో దొంగ హామీలు ఇస్తాడు. ఎన్నో గారడి మాటలు చెబుతాడు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+