కేసీఆర్‌పై అమిత్ షా నిప్పులు: తెలంగాణలో కమల వికాసం తథ్యం అంటూ..

సీఎం కేసీఆర్‌పై అమిత్ షా మునుగోడు వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. జనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఫైరయ్యారు. దళితబందు పథకం గురించి ప్రస్తావించారు. ఎంతమంది దళితులకు రూ. 10 లక్షలు ఇచ్చారని అడిగారు. గిరిజనులకు ఎకరం భూమి అయినా ఇచ్చారా అని నిలదీశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికతో రాష్ట్రంలో మార్పు జరుగనుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని వివరించారు.

 తర్వాత కేటీఆరే..

తర్వాత కేటీఆరే..


విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదని అమిత్ షా నిలదీశారు. నిరుద్యోగ యువతకు భృతి ఏమయ్యిందని అడిగారు. 2014 నుంచి టీచర్ల నియమకాలే జరగలేదని.. ఎందుకు ఆలస్యం అవుతుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పేదల ఇళ్ల సంగతి ఏమైందన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం సంగతి గురించి ప్రశ్నించారు. దళితుడు సీఎం అని చెప్పి.. రెండుసార్లు కేసీఆర్ పదవీ చేపట్టారని తెలిపారు. ఇప్పుడు కేసీఆర్.. ఆ తర్వాత కేటీఆర్ వస్తారని గుర్తుచేశారు. జనమే ఆ పార్టీని దూరంగా నెట్టాలని కోరారు. దళితులకు 3 ఎకరాల భూమి అని ఊరించారని.. ఎంతమందికి ఇచ్చారని అడిగారు.

 టాయిలెట్లను కూడా అడ్డుకుని..

టాయిలెట్లను కూడా అడ్డుకుని..

కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలను కూడా అడ్డుకున్న ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని అమిత్ షా అన్నారు. కేంద్రం ఇచ్చే టాయిలెట్లను కూడా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం ఏర్పడితే రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటామని.. దొడ్డు బియ్యం కూడా సేకరిస్తామని వివరించారు.

 పెట్రో ధర తగ్గించని కేసీఆర్

పెట్రో ధర తగ్గించని కేసీఆర్


పెట్రోల్ ధర తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ అని అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు ధర తగ్గించిందని గుర్తుచేశారు. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం తగ్గించలేదన్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన గెలిస్తే.. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి బీటలు బారతాయని అన్నారు. కేంద్రంలో మాదిరిగా ఇక్కడ కూడా అభివృద్ది జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కమల వికాసమే..?

కమల వికాసమే..?

మోడీ నేతృత్వంలో పనిచేసేందుకు సహకరిస్తారా.. బీజేపీని బలోపేతం చేస్తారా అని సభకు వచ్చిన వారిని అమిత్ షా ఉత్సహపరిచారు. ఇక తెలంగాణలో కమలం వికసించడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. తనతో పాటు చేతులు పైకి ఎత్తాలని.. భారత్ మాతాకీ జై అంటూ అమిత్ షా తన ప్రసంగం ముగించారు. ఆ తర్వాత కొందరు నేతలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+