కొలువు లేదు, ఉన్న భూమి తీసుకున్నారు.. ఆత్మహత్య శరణ్యం, కేటీఆర్‌కు లేఖ
విద్య దారి చూపుతుందో ఏమో కానీ.. అందరికీ కొలువు మాత్రం ఇవ్వదు. అంటే సర్కార్ కాదే.. ప్రైవేట్ నౌకరీ కూడా కష్టమే. అయితే చాలా మంది తమ వృత్తులు, వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే అలా వ్యవసాయం చేసే ఒకరినీ కూడా చేయనీయలేదు. ఉన్న కాస్త భూమిని అక్రమించేశారు. అదీ కూడా ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం కోసం.. ఇంకేముంది అతను మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇదీ కాస్త సంచలనంగా మారింది.
ఆత్మహత్య చేసుకునేందుకు తనకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ ఆ సదరు రైతు మంత్రి కేటీఆర్‌ను కోరారు. అతనిది నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని ఎడవెల్లి గ్రామం. ఈ మేరకు రైతు చొప్పరి శ్రీను మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నానని తన గోడును వెల్లబోసుకున్నాడు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు అదొక్కటే ఆదాయ మార్గం అని తెలిపారు.

పల్లె ప్రకృతి వనానికి తన భూమిని తీసుకున్నారని అతను బోరుమన్నాడు. కొంత భూమిని గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కోసం సేకరించారని చెప్పారు. ఇంజినీరింగ్ చదివిన తనకు ఎలాంటి ఉద్యోగం లేదని, దీంతో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను రోడ్డున పడ్డానని, జీవనం దుర్భరంగా ఉందని వివరించారు.
ఇటు కొలువు లేక.. అటు ఉన్న భూమి తీసుకోవడంతో.. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిపారు. తనకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదని వివరించారు. చనిపోయేందుకు అనుమతించాలని కోరారు. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు, కనగల్ తహసీల్దార్ కు, ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని వాపోయారు. అందుకే సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా తీసుకొచ్చానని వివరించారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications