నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.18 వేల కోట్లు కేటాయించండి, పోటీ నుంచి తప్పుకుంటాం: మంత్రి జగదీశ్ రెడ్డి సంచలనం

|
Google Oneindia TeluguNews

మునుగోడు బై పోల్‌లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఓ వైపు ప్రచారం చేస్తూనే.. మరోవైపు ఛాలెంజ్‌ల పరంపర కంటిన్యూ అవుతుంది. మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వివరించారు. అభివృద్ది పడకేసిందని పేర్కొన్నారు. ఇందుకు ముమ్మాటికీ కారణం కేంద్రమేనని చెప్పారు.

బీజేపీకి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ది కోసం పాటుపడాలని కోరారు. రూ.18 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అందుకు బీజేపీ అంగీకరిస్తే బై పోల్ నుంచి తప్పుకుంటామని తెలిపారు. తమకు లిఖితపూర్వకంగా హామీ కావాలని కోరారు. అలా చేస్తే.. తమ అభ్యర్థి బరిలో ఉండరని తెలిపారు.

if central government allocate 18 thousand crores trs will away munugodu bypoll

ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ను ఒప్పిస్తామని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆయనను ప్రాధేయపడతామని.. చివరికీ అంగీకారం తెలిపేలా చేస్తామని పేర్కొన్నారు. తమకు అభివృద్దే ఇంపార్టెంట్ అని తెలియజేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంస్థకు భారీ కాంట్రాక్ట్ దక్కిందనే ఆరోపణలు వచ్చాయి. అందుకోసమే ఆయన పార్టీని వీడారని విమర్శలు చేశారు. ఆ క్రమంలోనే జగదీశ్ రెడ్డి రూ.18 వేల కోట్ల నిధులు ఇవ్వాలని జగదీశ్ రెడ్డి కోరారు.

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య పోటీ ఉండనుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఏ మేరకు ప్రభావం చూపనున్నారో చూడాలీ. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య జోరుగా మాటల యుద్ధం జరుగుతోంది. మంత్రి జగదీశ్ రెడ్డి తన విమర్శలకు మరింత పదును పెట్టారు. బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు.

English summary
if central government allocate 18 thousand crores trs will away munugodu bypoll minister jagadish reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X