Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకసభ ఎన్నికలు 2019: నల్గొండ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

Recommended Video

    Lok Sabha Election 2019 : Nalgonda Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

    తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో నల్గొండ ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి లోక్‌సభ నుంచి దాదాపు అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీ హవా కనిపిస్తోంది. కానీ నల్గొండలో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎక్కువసార్లు గెలిచింది. మొదటి లోక్‌సభ నుంచి మూడో లోక్‌సభ వరకు, ఆ తర్వాత పదో లోక్‌సభ నుంచి పన్నెండో లోక్‌సభ వరకు, అనంతరం పద్నాలుగవ లోక్‌సభకు లెఫ్ట్ పార్టీ ప్రాతినిథ్యం వహించింది.

    1952లో రావి నారాయణ రెడ్డి (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా), 1957లో దేవులపల్లి వెంకటేశ్వర రావు (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా), 1962లో రావి నారాయణ రెడ్డి (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా), 1967లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొహమ్మద్ యూనస్ సలీమ్, 1971లో తెలంగాణ ప్రజా సమితి నుంచి రామకృష్ణారెడ్డి, 1977లో కాంగ్రెస్ నుంచి అబ్దుల్ లతీఫ్, 1980లో కాంగ్రెస్ నుంచి దామోదర్ రెడ్డి గెలిచారు.

    1984లో టీడీపీ నుంచి రఘుమా రెడ్డి విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ నుంచి చకిలం శ్రీనివాస రావు, 1991, 1996లలో లెఫ్ట్ పార్టీ నుంచి బొమ్మగోని ధర్మభిక్షం (రెండుసార్లు), 1998 నుంచి అదే పార్టీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి గెలిచారు. 1999లో టీడీపీ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి 2004లో లెఫ్ట్ పార్టీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి, 2009, 2014లలో కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

    #LokSabhaElection2019: All about Nalgonda Constituency

    2014 లోక్‌సభ ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 1,93,156 ఓట్లతో గెలిచారు. గుత్తాకు 4,72,093 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి 2,78,937 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 2,60,677 ఓట్లు వచ్చాయి. ఇక్కడి నుంచి పలుమార్లు గెలుపొందిన సీపీఐ(ఎం) 2014 ఎన్నికల్లో కేవలం 54,423 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. చివరిసారి 2004 గెలిచిన సీపీఐ(ఎం) 2009లో రెండోస్థానానికి, 2014లో నాలుగోస్థానానికి పడిపోయింది.

    నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 14,95,580 మంది ఓటర్లు ఉన్నారు. 7,47,281 మంది పురుష ఓటర్లు, 7,48,299 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2014లో 11,89,399 మంది ఓట్లు వేశారు. 80 శాతం ఓటింగ్ నమోదయింది. పురుషులు 6 లక్షలకు పైగా, మహిళలు 5,87వేలకు పైగా ఓట్లు వేశారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం జనాభా 20,43,419. గ్రామీణ జనాభా 76.24 శాతం, పట్టణ జనాభా 23.76 శాతంగా ఉంది.

    ప్రస్తుత ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీడీపీ నుంచి ఒకసారి, కాంగ్రెస్ నుంచి రెండుసార్లు.. మొత్తం మూడుసార్లు విజయం సాధించారు. ఇతను లోకసభలో 331 ప్రశ్నలు అడిగారు. తెలంగాణ యావరేజ్ 285గా, నేషనల్ యావరేజ్ 273గా ఉంది. ప్రయివేటు మెంబర్ బిల్స్ ప్రవేశపెట్టలేదు. 13 చర్చల్లో పాల్గొన్నారు. ఇది తెలంగాణ యావరేజ్ 36.7 శాతంగా, నేషనల్ యావరేజ్ 63.8 శాతంగా ఉంది. అటెండెన్స్ 49 శాతంగా ఉంది. తెలంగాణ యావరేజ్ 69 శాతం ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీలాడ్స్ నుంచి రూ.20.27 కోట్లు ఖర్చు చేశారు.

    గుత్తా సుఖేందర్ రెడ్డి మొదట టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వృత్తి వ్యవసాయం. 12వ తరగతి పాస్ అయ్యారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+