Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అప్పుడే ఉదయ సముద్రం దాదాపు పూర్తి.. ఆఖరి గింజ వరకు కొంటాం: వైఎస్ షర్మిల

అధికార టీఆర్ఎస్ పార్టీపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శల జడివాన కొనసాగుతోంది. ఆమె 21వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్ర దిగ్విజయంగా ప్రారంభమైంది. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఇరికట్టె క్రాస్ వద్ద నుంచి ప్రారంభమై.. బ్రాహ్మణవెలమల, చౌడంపల్లి వరకు సాగింది. చౌడంపల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు నిరాహార దీక్ష ముగించుకుని షర్మిల మాట్లాడారు. 6 గంటలకు పాదయాత్ర చౌడంపల్లిలో ముగిసింది. ఇవాళ పాదయాత్ర 7.5 కిలోమీటర్లు సాగింది.

 పైసా విడుదల చేయలే..

పైసా విడుదల చేయలే..

ఐదేళ్లుగా సీఎంగా వైఎస్ఆర్ నల్గొండ జిల్లాకు ఆరోజుల్లో 30 సార్లు వచ్చారు. ఉదయ సముద్రం పనులు ఇవాళ్టి వరకు కాలేదు. వైఎస్ఆర్ బతికుంటే పనులు అయిపోయి ఒక దశాబ్దం అయి ఉండేదన్నారు. ఉదయ సముద్రం దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. 100 కోట్లు పెడితే ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు పూర్తయిపోయేవి. 14 ఏళ్ల నుంచి ఒక్క పైసా కూడా ఒక్క పాలకుడు కూడా పెట్టకపోతే ఈ ప్రాజెక్టు ఇలాగే ఆగిపోయింది. మాకు చుక్కనీరు రాలేదని ఈ ప్రాంతం వాళ్లే చెప్పారు. వైఎస్ఆర్ వెళ్లిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఈ ప్రాంతానికి వెచ్చించలేదంటే ఈ ప్రాంతం మీద పేమ ఉన్నట్టా..లేనట్టా..? ఏడేండ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎన్ని సార్లు వచ్చారు..? కనీసం 2 సార్లు ఐనా వచ్చారా..? కేసీఆర్ బయటకు వచ్చారంటే అది ఉప ఎన్నికలు ఉంటేనే బయటకు వస్తారు. అవసరం ఉంటేనే వస్తారు. లేకపోతే రాడు. అది కేసీఆర్ పద్దతి అని విరుచుకుపడ్డారు.

ఏం మేలు చేశాడు

ఏం మేలు చేశాడు

కుంబ కర్ణుడు ఆరు నెలలు నిద్ర పోయి మిగతా ఆరు నెలలు తింటాడట. నిన్న, మొన్న చూశాం. సారు నిద్రపోయే టైం అయిపోయింది. ఇప్పుడు తినడానికని మేలుకుని ప్రెస్ మీట్ పెడుతున్నారు. రైతులకు ఏం మేలు చేశాడట. అసలు కేసీఆర్ సోయి ఉండి మాట్లాడుతున్నాడో..మత్తులో ఉండి మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. తెలంగాణలో ఏడున్నర సంవత్సరాల్లో 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు బాగున్నారని, వ్యవసాయం బాగుందని మాట్లాడుతున్నారు. వరి వేసుకోవద్దని, 80 వేల పుస్తకాలు చదివేశాడట కేసీఆర్ అపర మేదావి. అందరు పెద్ద మనుషులు కూర్చొని వరి వేయవద్దని ఒక డిక్లరేషన్ పాస్ చేశాడు. ఇందుకేనా కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంది..? అసలు వరి కొనుక్కోను అంటే ఇక ఈ రైతులు అంతా ఏమైపోవాలి..? ఏం చెప్పాడు కేసీఆర్..? కేంద్రం పెత్తనం ఎంటి..? ఆకరి గింజ వరకు నేనే కొంటానని చెప్పాడు కేసీఆర్. కేంద్రం పెత్తనం ఎందుకు ఇప్పుడు కేసీఆర్...? మీరే కొంటానన్నారు కదా..కొనండి. మీ మాట మీద నిలబడే మగతనం మీకు లేదా..? మీరు అంత మొనగాళ్లు కాదా..? అని అడిగారు.

 వరి పంట కొనకుంటే ఎలా...

వరి పంట కొనకుంటే ఎలా...

పంట పండాక ఇప్పుడు కొనను అంటే రైతులు అంతా ఏమై పోవాలి. రైతులను బజారున పడేసినట్టే కదా..? ఇది కేసీఆర్ పద్దతి. కేసీఆర్ లాంటి వాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్షల కోట్లు అప్పెందుకు చేశారు కేసీఆర్. వరి వేసుకోవద్దని చెప్పడానికే అయితే ప్రాజెక్టులు అన్నీ ఎందుకు కట్టారు. లక్షల కోట్ల అప్పు ఎందుకు తెచ్చారు. తీరా లక్షల కోట్ల అప్పు తెచ్చి ప్రజల మీద అప్పు మోపి, ప్రతి కుటుంబం మీద 4 లక్షలు రూపాయలు అప్పు మోపి, ఇప్పుడు వరి వేసుకోవద్దని అంటున్నాడు కేసీఆర్. ఇది పద్దతేనా..? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఇలా మాట మార్చొచ్చా..? మీరు ఎలా కొంటారో..? ఎవరిని ఒప్పిస్తారో..? ఇంకేమైనా చేస్తారో మాకు అనవసరం. ఆకరి గింజ వరకు వరి కొనాల్సిందేనని కేసీఆర్ ను రైతుల తరుపున షర్మిల డిమాండ్ చేశారు. అవసరమైతే కేంద్రంతో పోరాడుతానని అన్నాడు. ఎందుకు కొనుక్కోరో చూస్తానన్నాడు. కొనుక్కోవడం లేదని వాళ్ల మీద నెపం పెడుతున్నాడు కేసీఆర్. మరి ఆ రోజు ఎందుకు కేంద్రం పెత్తనం ఎమిటీ.. రైతు వరి పంట పండాక పంట కొననని చెబితే వారు ఏమైపోవాలి. ఆఖరి గింజ వరకు వరి పంట కొనాలని తమ పార్టీ ప్రజల తరుపున డిమాండ్ చేస్తోంది.

 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా..?

1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా..?

కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే..? లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడు. లక్షా 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారని అడిగారు. ఇంకో 80 వేలు మళ్లీ ఇచ్చేస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నాడు. 80 వేల ఉద్యోగాలు ఏమిటి..? పీఆర్సీ ప్రకారం 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం లక్ష 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రకారం లక్ష 91వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఉద్యోగాలకు కూడా కేంద్రమే ఆలస్యం చేస్తోందని కేసీఆర్ చెబుతున్నాడు. అయ్యా కేసీఆర్ కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసి 4 ఏండ్లు అయిపోయింది కదా..? ఇప్పటి వరకు మీరు దానికి కావాల్సిన నోటిఫికేషన్లు, సిబ్బందిని ఎందుకు భర్తీ చేయలేదు అని అడిగారు. ఆలస్యం చేస్తున్నది మీరా..ఇంకెవరైనా..? ఉద్యోగాలు ఇవ్వాలని మీకు సోయి ఉంటే వీల్లందరికీ ఉద్యోగాలు ఎప్పుడో వచ్చేవి. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు కనుకనే కదా..ఇంత మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంది. కేసీఆర్ పాలనలో డిగ్రీలు, పీజీలు చదివిన నిరుద్యోగులు హమాలీ పని, పత్తి కూలీకి, ఆటో తోలుతూ పనులు చేసుకుంటున్నారు. 8 వేలకు ఆటో డ్రైవర్లుగా పోతున్నారు. ఇందుకేనా డిగ్రీలు, పీజీలు చదివింది..? కూలీ నాలీ చేసి వారిని కష్టపడి చదివించుకుంది ఇందుకేనా..? అప్పులు చేసి వారిని చదివించుకుంది హమాలీ పనికి పంపేందుకేనా..? మన పిల్లలు హమాలీ పనిచేయాలని మంత్రి కూడా అదే చెబుతున్నాడు. అంటే మన పిల్లలు హమాలీ పని చేసుకోవాలి. కేసీఆర్ పిల్లలు రాజ్యాలు ఏలాలి.

మరీ మంత్రులు

మరీ మంత్రులు

5,6 తరగతులు చదవని వారు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు కావాలి..? ఇంతేనా కేసీఆర్. డిగ్రీలు, పీజీలు చేసిన యువతను నిరుద్యోగులుగా మార్చేందుకేనా కేసీఆర్ ను సీఎంగా చేసుకుంది..? ఈ వారంలో ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పాలకులకు ఏమైనా పట్టింపు ఉందా..? ఎవరైనా పట్టించుకుంటున్నారా..? కొంత మంది పురుగుల మందు తాగితే, ఇంకొంత మంది ఉరి వేసుకుని, ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చనిపోయారు. ఇవన్నీ హత్యలా..ఆత్మహత్యలా..? నిరుద్యోగ చావులకు కారణం నిరుద్యోగం. నిరుద్యోగానికి కారణం కేసీఆర్ అని ఫైరయ్యారు. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలు కాదా..? ముఖ్యమంత్రికి ఒక ముందు చూపు ఉండాలి. ఎంత మంది చదువుకున్న వాళ్లు ఉన్నారు. ఎంత మందికి నోటిఫికేషన్లు కల్పించాలి. ఇంకేంత మందికి ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది, ఇంకెంత మందికి కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాది కల్పించగలం అనే ఆలోచన ఉండాలి. అలా కదా వైయస్ఆర్ పరిపాలించిందన్నారు.

3 నోటిఫికేషన్లు

3 నోటిఫికేషన్లు

వైఎస్ఆర్ ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి 2004, 2006, 2008 మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఒకేసారి 58 వేల టీచర్ ఉద్యోగాలు, జంబో నోటిఫికేషన్ కింద ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చిన నాయకుడు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు. ప్రయివేటు రంగంలో కూడా 11 లక్షల ఉద్యోగాలు సృష్టించారు. కార్పొరేషన్ లోన్ల ద్వారా లక్షల పేద పిల్లలకు స్వయం ఉపాది కల్పించి వాళ్ల కాళ్ల మీద వాల్లు నిలబడేలా చూశాడు. ఇప్పడున్నాడు ఓ ముఖ్యమంత్రి ఎప్పుడైనా మీరు ఎలా ఉన్నారని మిమ్మల్ని ఎప్పుడైనా అడిగాడా..? అడుగు బయట పెట్టి సెక్రెటేరియట్‌కి పోయాడా..? కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో 54 లక్షల మంది యువత మాకు ఉద్యోగాలు లేవని ప్రభుత్వం దగ్గర ధరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ప్రభుత్వం దగ్గర ధరఖాస్తు చేసుకోని వారు ఇంకెంత మంది ఉంటారో..? నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలో మన రాష్ట్రం ఒకటి. కారణం కేసీఆర్ నిర్లక్ష్యం. 2 లక్షల ఉద్యోగాలు కాలీగా ఉన్నా కూడా వాటిని భర్తీ చేయడం లేదు కేసీఆర్ అని అడిగారు. దున్నపోతు మీద వాన పడినట్టు ఎంత మంది ఆత్మహత్య చేసుకుంటే నాకేమీ కుటుంబంలో మాత్రం 5 ఉద్యోగాలు ఉన్నాయి కదా అని మురిసిపోతున్నాడు కేసీఆర్. ఇదేనా పాలకులు ఆలోచించాల్సింది. పాలకులు చేయాల్సింది ఇదేనా..? ఇదేనా బంగారు తెలంగాణా..? ఎందుకు తెచ్చుకున్నాము తెలంగాణ..? నీళ్లు అన్ని కేసీఆర్ ఫాం హౌస్ కే, నిధులు కూడా కేసీఆర్ ఇంటికే, నియామకాలు కూడా కేసీఆర్ కుటుంబానికే..ఎవరు బాగుపడ్డారు. ప్రజలు బాగుపడ్డారా..? ఎన్ని మాటలు చెప్పాడు. ఎన్ని అబద్దాలు చెప్పాడు. ఎంత మోసం చేశాడు.

హామీలు..

హామీలు..

దళిత ముఖ్యమంత్రి, అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలన్నాడు. నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు, కేజీ టూ పీజీ విద్య, రైతులకు రుణమాఫీ ఇలా ఎన్నో హామీలు చెప్పి ఒక్క హామీనైనా నెరవేర్చారా..? మహిళలలకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తానని అన్నాడు. కనీసం రూపాయి పావలా వడ్డీ పడుతుందని మహిళలు చెబుతున్నారు. ఈ రోజు మహిళలు రుణాలు వాళ్ల ఇంటి కర్చులకోసమే తీసుకుంటున్నారు. బంగారు తెలంగాణ ఇదేనా..? ఇది బార్లు, బీర్ల తెలంగాణగా.. ఎంత మంది మహిళలు హత్యాచారానికి గురవుతున్నారు. ఇంకా సరిపోలేదన్నట్టు 400వైన్ షాపులకు పర్మిషన్ ఇచ్చారట కేసీఆర్. వ్యవసాయాన్ని నియంత్రిస్తారట. కానీ వైన్, బీర్ షాప్ లను మాత్రం నియంత్రించడట కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ యే ఒక తాగుబోతు గనక. ఇందుకేనా తెచ్చుకుంది తెలంగాణ. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఫీజు రియాంబర్స్ మెంట్ ఎవరికైనా వస్తుందా..? ఇచ్చేది 35000 వేలు. అది కూడా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. అధికార మద్ధంతో ఈ రోజు కేసీఆర్ కొడుకు కేటీఆర్ మాట్లాడుతారు. కేవలం 3, 4 శాతం మాత్రమే ఉద్యోగాలు ఇవ్వచ్చని అంటాడు. ఇంటికో ఉద్యోగమని వాగ్ధానం చేసింది వాళ్లు కాదా..? లేక పోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. వాళ్లు కాదా..? వాళ్ల ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు, ప్రజలకు మాత్రం 4 శాతం ఉద్యోగాలా..? ఇది న్యాయమేనా...?

Recommended Video

    మహేశ్వరం పార్లమెంట్ నియోజకవర్గాన్ని పూర్తి చేసుకున్న షర్మిళ పాదయాత్ర
    నిరుద్యోగుల తరపున పోరాటం

    నిరుద్యోగుల తరపున పోరాటం

    తమ పార్టీ నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాం. ప్రతీ నిరుద్యోగికి చెబుతున్నాం మీ కోసం మేం పోరాడుతున్నాం. ఉద్యోగాలు వచ్చేంత వరకు పోరాడతాం. కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చినా ఇయ్యక పోయినా వచ్చే రెండేండ్లలో మా పార్టీ గెలిచిన వెంటనే మొదటి సంతకం నిరుద్యోగులకు నోటిఫికేషన్లపైనే పెడతాం. నోటిఫికేషన్ క్యాలండర్ విడుదల చేసి భర్తీచేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అందరికీ స్కిల్ డెవలప్ మెంట్ చేసి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ల ద్వారా లోన్లు, ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు. లేక పోతే నిరుద్యోగ భృతి ఇస్తానని వివరించారు. 3016 రూపాయల నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ఉద్యోగాలను భర్తీ చేయలేక పోతే కేసీఆర్ కు ఆ పదవిలో ఉండే అర్హత లేదు. కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని కోరారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+