పోల్ ఆఫీసర్ పై దాడి.. చితక్కొట్టిన గ్రామస్థులు
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో పోలింగ్ ఆఫీసర్ పై దాడి చర్చానీయాంశంగా మారింది. హుజూర్ నగర్ సెగ్మెంట్ లోని మేళ్లచెరువు మండలం వెల్లటూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దివ్యాంగుడైన ఓ వృద్ధుడికి సహాయం చేసేందుకు సహకరించిన పోల్ ఆఫీసర్.. ఆయన ఒక గుర్తుకు వేయమంటే ఈయన మరో గుర్తుపై ఓటు వేయించారనేది ఆరోపణ.
దీంతో ఆ వృద్ధుడు అభ్యంతరం వ్యక్తం చేయగా అక్కడున్న కొంతమంది పోల్ ఆఫీసర్ తో వాగ్వాదానికి దిగారు. ఇలా చేయడమేంటని నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఆయనపై దాడికి దిగారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది. దీంతో గంటసేపు పోలింగ్ ఆగాల్సిన పరిస్థితి. అదలావుంటే ఆ పోల్ ఆఫీసర్ ను అక్కడ్నుంచి పంపించివేశారు సిబ్బంది. ఈ ఘటనపై రిటర్నింగ్ ఆఫీసర్ వివరణ కోరినట్లు సమాచారం.













Click it and Unblock the Notifications