ఏడేళ్ల నుంచి ఏం చేశారు సారూ.. ఉద్యోగాల కల్పనపై షర్మిల

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల విమర్శలు చేశారు. ప్రజాప్రస్థానంలో భాగంగా 40వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజ‌క‌వ‌ర్గం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో పర్యటించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్నందున.. వెలుగుపల్లిలో దీక్ష చేపట్టారు. ముందుగా వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సాయంత్రం వరకు నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగిందన్నారు

ఆటో డ్రైవర్లుగా..

ఆటో డ్రైవర్లుగా..


కేసీఆర్ హయాంలో నిరుద్యోగులు ఆటో డ్రైవర్లుగా మారుతున్నారు. డిగ్రీలు, పీజీలు చదివిన వారు చాయ్ కొట్టు, కూరగాయల షాపులు పెట్టుకుంటున్నారు. యువతులు పత్తి ఏరడానికి పోతున్నారు. మరికొందరు యువకులు హమాలీ పనికి పోతున్నారు. డిగ్రీ, పీజీలు చదివిన వాళ్లు కూలీలుగా పనిచేయాలా? ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు. మేం పార్టీ పెట్టకముందు నుంచే నిరుద్యోగంపై పోరాటం చేస్తున్నాం. ట్యాంక్ బండ్ వద్ద మూడు రోజుల పాటు దీక్ష చేస్తే మాపై దాడులు చేసి, బట్టలు చింపారు. అయినా మా పోరాటాన్ని ఆపలేదు. పాదయాత్రలో ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నాం. మా పోరాటం వల్లే ప్రభుత్వానికి బుద్ధి వచ్చింది, ప్రతిపక్షాలకు సోయి వచ్చింది. మా పోరాటం వల్లే కేసీఆర్ 80వేల ఉద్యోగాలను ప్రకటించారు.

ఏడేళ్ల నుంచి ఏం చేశారు..

ఏడేళ్ల నుంచి ఏం చేశారు..


ఏడేళ్లు నోటిఫికేష‌న్లు ఇవ్వ‌కుండా కేసీఆర్ 80 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇస్తామంటున్నారు. మిగిలిన ఉద్యోగాలు ఏమ‌య్యాయ‌ని మేం ప్ర‌శ్నిస్తున్నాం. పీఆర్సీ ప్ర‌కారం, బిస్వాల్ క‌మిటీ ప్రకారం ల‌క్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇవే కాదు కొత్త జిల్లాలు, మండ‌లాలు అన్నీ కలుపుకొంటే దాదాపు 3 ల‌క్ష‌ల 85 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటన్నింటినీ భ‌ర్తీ చేయాల‌ని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ మాట‌లు కోట‌లు దాటుతాయి... చేత‌లు గ‌డ‌ప దాట‌వు. 2018లో ఎన్నిక‌ల్లో నిరుద్యోగుల‌ ఓట్ల కోసం నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారు. ఎన్నిక‌లు పూర్త‌య్యాక ప‌ట్టించుకోలేదు. కేసీఆర్ గారు హామీ ఇచ్చి ఇప్పటికి దాదాపు 40 నెల‌లు కావ‌స్తోంది. ప్ర‌తి నెల మూడు వేల చొప్పున ప్ర‌తి నిరుద్యోగికి కేసీఆర్ గారు ల‌క్షా 20 వేల చొప్పున బాకీ ప‌డ్డారు. ఆ ల‌క్షా 20 వేల రూపాయ‌లు నిరుద్యోగుల‌కు చెల్లించాల‌ని డిమాండ్ చేశారు.

రాజీనామా చేయలే

రాజీనామా చేయలే


కేసీఆర్ నిరుద్యోగుల‌కు న్యాయం చేయ‌లేని ప‌క్షంలో ప‌ద‌వికి రాజీనామా చేసి ఒక ద‌ళితుడిని ముఖ్య‌మంత్రిని చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల కోసం పోరాటం చేయ‌డానికే మేం వైయ‌స్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టాం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ గాని ప్ర‌జ‌ల సంక్షేమం గురించి ఆలోచన చేయ‌డం లేదు. మోడీ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌లు పెంచితే కేసీఆర్ క‌రెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, మున్సిప‌ల్ ట్యాక్స్, రిజిస్ట్రేష‌న్ చార్జీలు, నీటి ప‌న్ను, ఇంటి ప‌న్ను పెంచుకుంటూ పోతున్నారు. కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాలు పేద‌ల ర‌క్తం పీల్చుతున్నారు. కేసీఆర్ వ‌రి వేయొద్దంటున్నారు. పాల‌కుల‌కు అలా చెప్పే హ‌క్కు ఉందా?
వ‌రి వేయ‌న‌ప్పుడు కోట్లు ఖ‌ర్చు చేసి క‌ట్టిన ప్రాజెక్టులెందుకు? కేసీఆర్ స‌మాధానం చెప్పాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+