హారతులు పట్టనున్న చంద్రబాబు
కృష్ణానది జలకళను సంతరించుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తోంది. గరిష్ఠ స్థాయి నీటి మట్టాన్ని అందుకుంది. వరద నీటితో పోటెత్తుతోంది. ఇన్‌ఫ్లో తగ్గకపోవడంతో.. అధికారులు శ్రీశైలం రిజర్వాయర్ ఏడు గేట్లను ఎత్తారు. వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో తీవ్రత ఆధారంగా మరో రెండు గేట్లను ఎత్తే అవకాశం ఉంది.
శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కృష్ణా, తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాల వల్ల ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. జూరాల ప్రాజెక్టు, సుంకేసుల బ్యారేజీ నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు 4.81 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతోంది.

నీటిమట్టం 880.30 అడుగులకు చేరింది. దీనికి అనుగుణంగా ఇన్‌ఫ్లో మరింత అధికంగా ఉన్న నేపథ్యంలో గేట్లను ఎత్తివేయాలని అధికారులు నిర్ణయించారు. ఎగువన కురుస్తోన్న వర్షాల వల్ల శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వచ్చే ఇన్‌ఫ్లో మరింత అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా మరిన్ని గేట్లను ఎత్తివేసే అవకాశాలు లేకపోలేదు.
ప్రస్తుతం 80 వేల క్యూసెక్కులకు పైగా వరద నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం వరద జలాల ప్రభావంతో ఇక పులిచింతల, నాాగార్జున సాగర్ కూడా జలకళను సంతరించుకుంటున్నాయి. నాగార్జున సాగర్ క్రమంగా నిండుతోంది. గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకుంటోంది. ఒకట్రెండు రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగితే- నాగార్జున సాగర్ రిజర్వాయర్ గేట్లను కూడా ఎత్తే అవకాశాలు లేకపోలేదు.
కాగా- శ్రీశైలం గేట్లను ఎత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును సందర్శించనున్నారు. గురువారం ఆయన శ్రీశైలం పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీశైలం రిజర్వాయర్‌ను సందర్శిస్తారు. కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు.
ఈ పర్యటనలో ఆయన వెంట జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ ఫరూక్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సహా నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications