కోటంరెడ్డి హాట్ కామెంట్స్: విపక్షాలను వేధించొద్దు.. శ్రేణులకు హితవు
ఏపీలో చిత్ర పరిస్థితి నెలకొంది. అధికార వైసీపీలో రఘురామ పక్కలో బల్లెంలా తయారయ్యారు. అతనిపై అనర్హత వేటు వేసేందుకు అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ లాభం లేకపోయింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగింది. అందులో చాలా మంది పదవీ ఆశించారు. అయితే అందులో ప్రముఖులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒకరు.. ఒకానొక సందర్భంలో ఆయన కంట తడి కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్.. మంత్రి పదవీ రాలేదనే చేశారా అనే సందేహాం తలెత్తుతుంది.

వేధించొద్దు..
విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలను వేధించవద్దని శ్రేణులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. ఈయన నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. శనివారం నెల్లూరులో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో పాల్గొన్నారు. విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలను రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే పరిగణించాలని కోరారు. అంతే తప్ప వారిని వేధించొద్దని నొక్కి వక్కానించారు. అదీ మనకే మంచిది కాదని సూచించారు.

వాత పెడతారు..
అంతేకాదు అధికార మదంతో ప్రవర్తిస్తే జనం వాత పెడతారని కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్ చేశారు. అధికార మదంతో వ్యవహరించే వారికి ఎక్కడ వాత పెట్టాలో జనానికి తెలుసు అని కామెంట్ చేశారు. ఆ వాతలను ఎప్పుడు పెట్టాలో కూడా జనానికి బాగా తెలుసు అని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే సొంత పార్టీ గురించి ఆయన కామెంట్ చేశారు. వాస్తవానికి శ్రేణులకు మంచి, చెడు చెప్పి ఉంటారు.. కానీ భావం మాత్రం మరోలా ఉంది. అవును మంత్రి పదవీ చేపడితే ఆయన ఇలా మాట్లాడేవారు కాదనే వారు కూడా ఉన్నారు.

మంత్రి పదవేనా..?
కోటంరెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆయన ఏంటీ ఇలా మాట్లాడారని ఒక్కటే చర్చ.. పైకి వేధించొద్దు.. మరోసారి అధికారం రాదు.. అందరినీ ఓకేలా చూడాలని అంటోన్న.. లోన మాత్రం మంత్రి పదవీ అంశం ఉంటుంది. ఇదీ మాత్రం పక్కా అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఇలా బహిరంగంగా కామెంట్ చేశారని అంటున్నారు.












Click it and Unblock the Notifications