జగన్‌ను ఎవరూ నమ్మట్లే.. జనమేట్ల నమ్ముతారు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
వైసీపీ ప్లీనరీ ముగిసింది. సీఎం జగన్ శాశ్వత అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు. సొంత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఇక విపక్షాలు ఊరుకుంటాయా.. అదే స్థాయిలో విమర్శలు చేశాయి. విజయమ్మ చేత బలవంతంగా గౌరవ అధ్యక్ష పదవీకి రాజీనామా చేయించారని విమర్శించాయి. జగన్ తల్లి అడ్డును తొలగించుకున్నారని మండిపడ్డాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైరయ్యారు.

ఎవరూ నమ్మట్లే..
సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైరయ్యారు. విజయమ్మ, షర్మిల, కేవీపీ, సూరీడు ఎవరూ కూడా జగన్‌ను నమ్మట్లేదని అన్నారు. పార్టీకి విజయమ్మ సెలవు చీటీ ఇచ్చేశారని, చెల్లి షర్మిల అన్న ముఖం చూడకూడదని మరో రాష్ట్రానికి వెళ్లిపోయిందని వివరించారు. జగన్ విడిచిన బాణం అని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆమె ఇప్పుడు దూరమైందని అన్నారు. ఇలా ఒక్కొక్కరి గురించి సోమిరెడ్డి తెలిపారు.

ఆత్మ ఎక్కడ.. నీడ ఏదీ
వైఎస్ఆర్ ఆత్మగా భావించే కేవీపీ మిమ్మల్ని పార్టీ ఎందుకు మారలేదని సోమిరెడ్డి అడిగారు. మిమ్మల్ని జైలుకు పంపించిందని పార్టీలో ఉన్నాడని.. మీతో ఎందుకు రాలేదని అడిగారు. వైఎస్ఆర్ నీడ అని సూరీడు గురించి చెబుతారు, ఇప్పుడా నీడ మాయమైపోయిందని పేర్కొన్నారు. మరో చెల్లి సునీత అయితే జగన్ ముఖం చూసేందుకు కూడా ఇష్టపడడంలేదని తెలిపారు. మిమ్మల్ని కుటుంబ సభ్యులు, ఆత్మీయులే నమ్మనప్పుడు ప్రజలెందుకు నమ్మాలి? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

విమర్శించడానికే..?
ఆత్మస్తుతి, పరనింద తప్ప ప్లీనరీలో ఏముందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగారు. మంత్రులు, ఇతర నేతలతో పొగిడించుకోవడానికి, విపక్ష నేతలను విమర్శించడానికే ప్లీనరీ నిర్వహించారని విమర్శించారు. అంతే తప్ప ఇందులో ఒరిగింది ఏమీ లేదని చెప్పారు. వైసీపీ ప్లీనరీ ఓ డ్రామా అని సోమిరెడ్డి విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications