వర్షం తెచ్చిన తంటా.. రోడ్ల దుస్థితిపై జనసైనికుల డిజిటల్ క్యాంపెయిన్, మంచి రెస్పాన్స్
వర్షాలతో రహదారులు దారుణంగా తయారయ్యాయి. వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టాలని విపక్షాలు కోరుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు జన సైనికులు క్యాంపెయిన్ చేపట్టారు. ఏపీలో రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ మొదటి రోజు నిర్వహించారు. కలిగిరి జనసైనికులు పాల్గొన్నారు.
భారీ వర్షాలతో అధ్వాన్నంగా మారిన రోడ్లకు సంబంధించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను సీఎం జగన్‌కు తెలిసేలా జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపు మేరకు #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్‌తో జన సైనికులు డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టారు జనసైనికులు. డిజిటల్ క్యాంపెయిన్‌కు విశేష స్పందన వస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు పవన్ కోనసీమలో కొత్తపీట దగ్గర రోడ్డు ఛిద్రమై వీడియోను పోస్టు చేశారు. అధ్వాన్నంగా మారిన వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు.

కోనసీమలో కొత్తపేట దగ్గర రోడ్డు ఛిద్రమై ఉన్న వీడియోను పోస్ట్ చేసి ట్యాగ్ చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేక చిత్రాన్ని ట్వీట్ చేశారు. అప్పటి నుంచి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. తొలి రెండు గంటల్లోనే ట్రెండింగ్‌లో ట్వీట్స్ మొదలైన అగ్రస్థానానికి చేరింది. తొలి రోజున 3.55 లక్షల ట్వీట్స్ వచ్చాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచీ గతుకులమయంగా ఉన్న రోడ్లను చెప్పే ఫోటోలను, వీడియోలను పోస్టు చేశారు. ఈ ట్వీట్స్ 218 మిలియన్ల మందికి చేరువయ్యాయి.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం మండపేట నియోజకవర్గంలో మండపేట నుంచి కోరుమిల్లి, కపిలేశ్వరపురం వెళ్ళే రోడ్డులోని గోతులను చూపిస్తూ ట్వీట్ చేశారు. కోరుమిల్లి - జొన్నాడ రోడ్డునీ, కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం-కాకినాడ ప్రధాన రోడ్డు దుస్థితిపై ఆయన ట్వీట్స్ చేశారు. ఇలా జనసేన క్యాంపెయిన్ కొనసాగుతోంది. సమస్యలను జన సైనికులు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు.












Click it and Unblock the Notifications