ఇస్రో నయా రికార్డ్: ఇక కమర్షియల్ రూట్: అమేజాన్-1 కక్ష్యలోకి

నెల్లూరు: ఇస్రో మరో రికార్డ్‌ను అందుకుంది. జిల్లాలోని శ్రీహరి కోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ 51 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. పూర్తిస్థాయి వాణిజ్యపరమైన ప్రయోగం ఇది. ఒకవైపు చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1, గగన్‌యాన్ ప్రయోగాలకు సిద్ధపడుతూనే కమర్షియల్ బాట పట్టింది ఇస్రో. ఇందులో భాగంగా కొద్దిసేపటి కిందటే పీఎస్ఎల్వీ సీ 51/అమేజానియా-1 రాకెట్‌, సింధునేత్రను రోదసిలోకి పంపించింది. వ్యవసాయాధారిత ప్రయోజనాల కోసం బ్రెజిల్ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. దీన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

ఈ ప్రయోగం ద్వారా బ్రెజిల్‌కు చెందిన 637 కిలోల బరువైన అమెజానియా-1 ఉప్రగహంతో పాటు మరో 18 చిన్న ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏర్పాటైన తరువాత చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. నాలుగవ దశల్లో రాకెట్‌లోని ఇంధనాన్ని మండించడం ద్వారా 18 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. రాకెట్‌లోని మొదటి దశ 1.49, రెండో దశ 2.42 నిమిషాలకు మండించారు. మూడు, నాలుగు దశలను దాటుకున్న ఈ రాకెట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం ఈ ప్రాజెక్ట్ విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది.

ISROs PSLV-C51 carrying Amazonia-1 and 18 other satellites lifts off from Sriharikota

రేడియేషన్ స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, కమ్యూనికేషన్ల వ్యవస్థను మరింత మెరుగుపర్చడం, సముద్ర తీర ప్రాంతాలపై నిఘా ఉంచడం వంటితో పాటు కమర్షియల్ శాటిలైట్లను కూడా తీసుకెళ్లడానికి దీన్ని చేపట్టారు. నాలుగు దశలు పూర్తయిన తరువాత అమెజానియా-1 ఉపగ్రహాన్ని భూమికి 537 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌సింక్రనిస్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. శ్రీహరికోట నుంచి చేపట్టిన 78వ ప్రయోగం ఇది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 53వది.

ఇస్రో ఛైర్మన్ కే శివన్ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. రెండు రోజుల కిందటే ఆయన బెంగళూరు నుంచి షార్ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ ప్రయోగానికి ముందు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన వెంటనే శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పరస్పరం అభినందించుకున్నారు. వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షానికి మోసుకెళ్లడంలో మరో విప్లవాత్మక మలుపు తీసుకున్నట్టయిందని శివన్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+