ఆత్మకూరులో వైసీపీ విజయం నల్లేరు మీద నడకే.. మంత్రి రోజా

ఆత్మకూరు ఉప ఎన్నికపై అధికార వైసీపీ ఫోకస్ చేసింది. క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తోంది. పార్టీ అభ్యర్థి తరుఫున ప్రచారం ముమ్మరం చేసింది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా మంత్రి ఆర్కే రోజా రంగంలోకి దిగారు. ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి తరుఫున ప్రచారం చేశారు. విపక్షాలను టార్గెట్ చేసి విమర్శలు సంధించారు.

బీజేపీపై రోజా విరుచుకుపడ్డారు. విమర్శలు, ప్రశ్నల వర్షం కురిపించారు. ఉపఎన్నికలో గెలుపు తమదేనని చెప్పేశారు. మంత్రి ఆర్కే రోజా వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా వైసీపీ గెలుపు ఖాయం అని జోస్యం చెప్పారు. నామమాత్రపు పోటీలో బీజేపీ నిలవడం అవసరమా? అని మంత్రి రోజా ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏపీలో అమలవుతున్న పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని అడిగారు.

ycp will won atmakur by poll andhra pradesh minister rk roja said.

జేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమ్మఒడి లేదు? ఎందుకు వైఎస్ఆర్ చేయూత లేదు? ఎందుకు ఆసరా లేదు? ఎందుకు నాడు నేడు అమలు చేయడం లేదు? ఎందుకు ఈబీసీ నేస్తం లేదు? వాళ్ల రాష్ట్రాల్లో ఇవన్నీ ఎందుకు అమలు చేయడం లేదో మీరు అడగాల్సిన అవసరం ఉంది అని ఓటర్లను ఉద్దేశించి రోజా అన్నారు.

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ పోటీ చేయడం లేదు. బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. పోటీ నుంచి తప్పుకున్నా లోపాయికారి మద్దతివ్వడం టీడీపీకి అలవాటని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జన్మభూమి కమిటీతో చంద్రబాబు రాష్ట్రాన్ని కర్మభూమిగా మార్చాడని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో వైసీపీ జోరుగా ప్రచారం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+