వైసీపీలోకి ఆనం కుమారుడు - ఆపరేషన్ నెల్లూరు..!?
వైసీపీ ఆపరేషన్ నెల్లూరు ప్రారంభించింది. నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉంది. అక్కడ అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి దగ్గరయ్యారు. వైసీపీని దెబ్బ కొట్టేందుకు టీడీపీ వ్యూహాత్మక ఎత్తుగడలు అమలు చేస్తోంది. దీంతో వైసీపీ అలర్ట్ అయింది. కౌంటర్ స్ట్రాటజీ మొదలు పెట్టింది. ఆనం కుటుంబ సభ్యుల పైన గురి పెట్టింది. వరుసగా పార్టీలో చేర్చుకుంటోంది. ఇప్పుడు వైసీపీ ఆనంకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్దమైంది.
వైసీపీ కొత్త స్కెచ్: నెల్లూరు జిల్లాలో వైసీపీ 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరులో వైసీపీని దెబ్బ తీయాలనేది టీడీపీ లక్ష్యం. ఇందుకోసం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ ఇచ్చింది. వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు టీడీపీకి మద్దతుగా మారారు. ఆనం, కోటంరెడ్డి ఇద్దరూ తిరిగి టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయం అయింది.

మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి పోటీ పైన నిర్ణయం ఫైనల్ కాలేదని సమాచారం. ఈ సమయంలో వైసీపీ కౌంటర్ ఆపరేషన్ ప్రారంభించింది. మూడు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను నియమించిన వైసీపీ...ఆనం కుటుంబీకులను తమ పార్టీలో చేర్చుకొనే వ్యూహాల కు పదును పెట్టింది. అందులో భాగంగా కార్యాచరణ వేగవంతం చేసింది.
మారుతున్న సమీకరణాలు: నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డికి సీనియర్ నేతగా ఉన్నారు. 1983 లో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలవటం ప్రారంభించిన ఆనం ఆ తరువాత రాపూరు, ఆత్మకూరు నియోజవకవర్గాల్లో గెలుస్తూ వచ్చారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన ఆనం వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇప్పుడు టీడీపీలోకి చేరటం ద్వారా ఆత్మకూరు నుంచి పోటీకి సిద్దం అవుతున్నారు. నెల్లూరు నుంచి మాజీ మంత్రి నారాయణ లేదా ఆయన అల్లుడు రవి తేజ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మాజీ మంత్రి అనిల్ నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఉండనున్నారు. తన మీద పోటీ చేసి గెలవాలని ఆనం ..నారాయణకు సవాల్ చేసారు.

ఆనం కుమారుడిపై గురి: ఆనం రామనారాణ రెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి కలిసి రాజకీయాల్లో కొనసాగారు. ఈ ఇద్దరితో పాటుగా ఆనం జయకుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి మద్దతుగా నిలిచారు. ఆనం వివేకా మరణం తర్వాత అప్పటిదాకా టిడిపిలో ఉండి.. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.. అంతకంటే ముందే ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. మరో సోదరుడు జయ కుమార్ రెడ్డి మాత్రం టిడిపిలోనే ఉన్నారు.
తాజాగా ఆనం జయ కుమార్ రెడ్డిని వైసీపీ లోకి ఆహ్వానించింది. ఆనం వివేకానందరెడ్డికి ఇద్దరు కుమారులు. వారిలో ఒకరైన రంగ మయూర్ రెడ్డి ప్రస్తుతం రామనారాయణ రెడ్డితో కలిసి కొనసాగుతున్నారు. మరో కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి తో వైసీపీ టచ్ లోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోవటం ఖాయమని ప్రచారం జరుగుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications