Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమానుషం: కాలితో తన్నిన తహసీల్దార్, టిప్పర్ కింద పడి యాచకుడు మృతి

నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూరు పట్టణంలో ఓ డిప్యూటీ తహసీల్దార్ అమానుషంగా ప్రవర్తించడంతో ఓ యాచకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆర్మూర్‌లోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టిప్పర్ ఢీకొని నిజాంసాగర్ కెనాల్ ప్రాంతానికి చెందిన శివరాం అనే యాచకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆర్మూర్‌ పట్టణంలోని మామిడిపల్లి సిగ్నల్‌ వద్ద ఆగిన కార్ల అద్దాలు తుడుస్తూ.. డబ్బులు యాచిస్తూ శివరాం అనే వ్యక్తి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 22న సాయంత్రం సిగ్నల్ వద్దకు వచ్చిన మెండోరా మండల డిప్యూటీ తహశీల్దార్‌ రాజశేఖర్‌ కారు ఆగింది. అదే సమయంలో శివరాం రోజూ చేసే పనిలో భాగంగా డిప్యూటీ తహశీల్దార్‌ కారు అద్దాలను క్లీన్‌ చేశాడు.

beggar fell under the lorry, died, after deputy tahsildar throws him.

అనంతరం డబ్బులు ఇవ్వాలని తహసీల్దార్‌ను కోరాడు. అయితే.. రాజశేఖర్‌ మాత్రం డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇంతలోనే సిగ్నల్‌ పడటంతో రాజశేఖర్‌ తన కారును ముందుకు పోనిచ్చాడు. అయితే, డబ్బులు ఇస్తాడేమో అన్న ఆశతో కారు వెంటే శివరాం పరుగులు తీశాడు. అది చూసి తీవ్ర అసహాసనానికి గురైన రాజశేఖర్‌.. కారు ఆపి మరీ, శివరాంను కాలితో తన్నాడు. దీంతో అదుపు తప్పిన శివరాం.. తూలుతూ వెళ్లి రోడ్డుపై పడ్డాడు. అదే సమయంలో అటుగా వచ్చిన టిప్పర్‌ శివరాం పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. అక్కడే ఉన్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేశారు. మెండోరా డిప్యూటీ తహశీల్దార్‌ అమానుష చర్య బయటపడటంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డబ్బులు అడిగి ఇవ్వాలి లేదంటే వెళ్లిపోవాలి కానీ.. ఇలా ప్రాణాలు తీస్తారా? అని స్థానికులు మండిపడుతున్నారు. శివరాం కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో వారికి పోలీసులు సర్ది చెప్పి శాంతింపజేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+