నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శీనన్న ఇదేంది.. ఏ పార్టీలో ఉన్నానో తెలియదు, కామెంట్స్ వైరల్

|
Google Oneindia TeluguNews

కొందరు రాజకీయ నేతలు హాట్ కామెంట్స్ చేస్తుంటారు. సమయం, సందర్భం అంటూ ఏదీ ఉండదు. వారు మాట్లాడే మాటలు అలా కలిసి వస్తాయి. మరికొందరు మాత్రం డిఫరెండ్.. ఇక విషయాని వస్తే.. సీనియర్ నేత డీ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గురించి, రాజకీయ పార్టీ గురించి ఆయన వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీలో ఉన్నానో తనకే తెలియదని చెప్పారు. వాస్తవానికి డీఎస్ టీఆర్ఎస్‌లో ఉండగా.. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కానీ ఆయన కుమారులు మాత్రం చెరో పార్టీలో ఉన్నారు. దీంతో డీఎస్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.

సెన్సేషనల్ కామెంట్స్

సెన్సేషనల్ కామెంట్స్


డీ శ్రీనివాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలియదు అన్నారు. సీనియర్ నేత అయి ఉండి ఏ పార్టీలో ఉన్నానని మాట్లాడటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఒక కొడుకు అర్వింద్ బీజేపీలో ఎంపీగా ఉండగా, మరో కొడుకు సంజయ్ కాంగ్రెస్‌లో చేరతానని కామెంట్ చేశారు. దీంతో డీఎస్ స్పందించారు. ఇద్దరు కొడుకులు తనకు రెండు కళ్ళు అని డీఎస్‌ పేర్కొన్నారు. వారిద్దరు ఏ పార్టీలో ఉన్నా సమాజ సేవలో ఉండాలనే కోరుకుంటా అని డీఎస్‌ అభిప్రాయపడ్డారు. అంతేకాదు కూర్చుండి చక్రం తిప్పగలిగిన సత్తాను తనకు దేవుడు ఇచ్చాడని డీఎస్‌ అన్నారు.

దూరం.. దూరం...

దూరం.. దూరం...


డీఎస్.. టీఆర్ఎస్‌లో ఉన్నా అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. కేసీఆర్‌తో మాటలు లేవు, మాట్లాడుకోవడం లేదు. రాజ్యసభ సభ్యునిగా కంటిన్యూ అవుతున్నారే తప్ప.. గులాబీ దళంలో పెద్దగా ఏమీ చేయడం లేదు. డీఎస్‌పై చర్యలు తీసుకొని.. బీసీ ఓటు బ్యాంకును కోల్పోవడం ఎందుకు అని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసమే యాక్షన్ లేదు. లేదంటే ఎప్పుడో డీఎస్ పని పట్టేవారు.. ఈటల రాజేందర్ వ్యవహారమే ఇందుకు ఉదహరణగా చెప్పుకోవచ్చు. డీఎస్ కూడా దూరం.. దూరంగానే ఉంటున్నారు.

కాంగ్రెస్‌లో చేరతా అంటూ..

కాంగ్రెస్‌లో చేరతా అంటూ..


కాంగ్రెస్ పార్టీ నుంచి డీఎస్.. టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక.. సంజయ్ కాంగ్రెస్‌లో చేరతానని కామెంట్ చేశారు. దీంతో తండ్రి, ఇద్దరు కొడుకులు చేరో పార్టీలో ఉన్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

English summary
dont know which party belongs to me senior leader d srinivas made sensational comments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X