నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రాలు చేసే అప్పులను కేంద్రం అడుగుతుంది: నిర్మల

|
Google Oneindia TeluguNews

సమయం, సందర్భం దొరికితే చాలు.. టీఆర్ఎస్, బీజేపీ నేతలు/ మంత్రులు ఫైర్ అవుతున్నారు. ఏ విషయంలోనైనా పేచీకి దిగుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఆమె తెలంగాణ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. గురువారం కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆమోదించిన బడ్జెట్ కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడం లేదని వెల్లడించారు. బడ్జెట్‌లో చాలా అప్పుల ప్రస్తావనే లేదని ఆరోపించారు. రాష్ట్రాల అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ఉన్న మిగులు బడ్జెట్ ఇప్పుడు లోటు బడ్జెట్‌గా మారిపోయిందని విమర్శించారు. తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు ఉందని పేర్కొన్నారు.

 states waiver central government asks minister nirmala sitharaman

ఎఫ్ఆర్ బీఎం పరిధిని తెలంగాణ ఎప్పుడో దాటిపోయిందని గుర్తుచేశారు. ప్రజలకు నిజాలు తెలిసిపోతాయనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ఆయుష్మాన్ భారత్‌లో చేరడం లేదని ఆరోపించారు. తెలంగాణ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అని మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని నిర్మల ధ్వజమెత్తారు.

English summary
states waiver central government asks finance minister nirmala sitharaman said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X