నిజామాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభించిన కేటీఆర్: 4 వేల మందికి ఉపాధి

నిజామాబాద్: రూ. 50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్‌ను పరిశీలించారు. కొత్తగా రిక్రూట్ అయిన ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునేరీతిలో ఈ ఐటీ టవర్‌ను నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలుపుకుని మూడు అంతస్తులతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎకరం భూమిలో ఐటీ టవర్‌ను డిజైన్ చేశారు.

మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్తుల్లో ఐటీ టవర్‌ను విస్తరించాలనుకున్న సమయంలో ఎలాంటి స్థల కొరత లేకుండా ఉండేందుకు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, ఐటీ టవర్‌లో ప్రభుత్వపరంగా టీఎస్ఐఐసీ ద్వారా మౌలిక వసతులు, అత్యాధునిక సౌకర్యాలను కల్పించింది. ఈ ఐటీ టవర్ ప్రారంభంతో సుమారు 4వేల మందికి ఉపాధి లభించనుంది.

Telangana minister ktr inaugurated IT tower in nizamabad.

ఐటీ సంస్థలను నెలకొల్పబోయే వారంతా ఐటీ శాఖతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామక ప్రక్రియను టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో జులై 21న నిర్వహించింది. వేలాది మంది హాజరు కాగా, నైపుణ్యం కలవారిని ఐటీ కంపెనీలు రిక్రూట్ చేసుకున్నాయి.

సమీకృత కలెక్టరేట్ భవనం, ఐటీ టవర్‌కు ఆనుకుని నిర్మితమైన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్చన్ సెంటర్‌కు జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా నామకరణం చేశారు. ఇందుకోసం రూ. 6.15 కోట్లు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఏసీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో ఉండగా.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ ఈ ప్రాంత యువతీ, యువకుల మేలు కోసం ఎన్ఏసీని నెలకొల్పారు. ఇందులో ఆధునాతన తన సౌకర్యాలను కల్పిస్తున్నారు.

Telangana minister ktr inaugurated IT tower in nizamabad.

కాగా, ఐటీ టవర్ తోపాటు న్యాక్ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను, అధునాతన వైకుంఠధామాన్ని, రఘునాథ చెరువు ట్యాంక్‌బండ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు పాలిటెక్నిక్ కాలేజీ మైదనాంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్ తిరుగు పయనమవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+