Accident: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..
అతి వేగం ప్రమాదకరమని తెలిసినా.. పట్టించుకోవడం లేదు. ప్రాణాలు పోతాయనే భయం లేకుండా వాహనాలు నడుపుతున్నారు. తాజాగా నిజామాబాద్ పట్టణ శివారులోని అర్సపల్లి బైపాస్‌రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. నిజామాబాద్ నుంచి గురువారం సాయంత్రం రెంజల్ మండలం దూపల్లి వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఆశోక్ లే ల్యాండ్ వాహనం ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. భవన నిర్మాణ పనులకు వెళ్లిన కూలీలు ఆటోలో ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.మృతి చెందిన వ్యక్తులు, గాయపడిన వారు బోధన్ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 8 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆశోక్ లే ల్యాడ్ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.

ఏపీలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరుకు చెందిన మానేపల్లి రాజకుమార్, కిర్లంపూడి మండలం సోమవరానికి చెందిన మలిరెడ్డి దుర్గాభవానికి మే 10న వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇటీవలే నిశ్చితార్థం కూడా ఘనంగా నిర్వహించారు. గత మంగళవారం వారిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత ఆలయానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు.
మార్గమధ్యంలో వెనుక నుంచి వచ్చిన ఓ లారీ వారిని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 15 రోజుల్లో పెళ్లి ఉండగా.. కాబోయే పెళ్లి జంట మృతి చెందడం స్థానికంగా విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications