Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం: ఆ నియోజకవర్గంలో చురుగ్గా భూసేకరణ: దొనకొండపైనా

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో విమానాశ్రయాన్ని నిర్మించే దిశగా ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. అన్ని జిల్లాల్లోనూ ఎయిర్‌పోర్టులను నిర్మించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా చర్యలను తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిరోజుల కిందటే చేసిన ప్రకటనకు అనుగుణంగా- అధికారులు రంగంలోకి దిగారు. భూసేకరణ కోసం ప్రయత్నాలు చేస్తోన్నారు. ఎయిర‌పోర్టును నిర్మించడానికి 1,600 ఎకరాల మేర భూమి అవసరమౌతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో భూసేకరణ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు అధికారులు. ప్రభుత్వ స్థలం ఉన్నచోటే నిర్మించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. తొలిదశలో 1,000 ఎకరాలను గుర్తించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నుంచి క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో- అద్దంకి రెవెన్యూ అధికారులు భూములను గుర్తించే పనిలో పడ్డారు. కొద్దిరోజులుగా ఈ పనులు విస్తృతంగా సాగుతున్నాయి.

Airport in Prakasam: Officials focused on land acquisition near Addanki.

అద్దంకి, తిమ్మాయపాలెం మండలాల్లో ఖాళీగా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సినంత ఖాళీ స్థలం ఉన్నట్లు నివేదికలను సిద్ధం చేశారు. ఈ స్థలం హద్దులను గుర్తిస్తూ మ్యాప్‌ను సైతం రూపొందించారు. దీన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికలో తమ అభిప్రాయాలను కూడా తెలియజేశారు రెవెన్యూ అధికారులు. అద్దంకి-తిమ్మాయపాలెం వద్ద ఒకే చోట 900 ఎకరాల మేర ప్రభుత్వ స్థలం ఉండటం వల్ల దీన్ని అనువైన ప్రాంతంగా పేర్కొన్నారు.

మేదరమెట్ల నుంచి తెలంగాణలోని నార్కట్‌పల్లికి వెళ్లే మార్గంలోని బలరామకృష్ణపురం, కొరిశపాడు, బొడ్డువానిపాలెం పరిసర ప్రాంతాల్లో 1,600 ఎకరాల భూమి ఉందని తమ నివేదికలో పేర్కొన్నారు. ఇందులో ప్రభుత్వ భూమి తక్కువగా ఉందని వివరించారు. 110 ఎకరాల మేరకే ప్రభుత్వ భూమి ఉందని, మిగిలిన 890 ఎకరాలు పట్టా భూములుగా గుర్తించామని, దీన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని సూచించారు.

భూమిని కొనుగోలు చేయాల్సి రావడం కంటే ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్న చోటే విమానాశ్రయం నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా- జిల్లాలోనే ఉన్న దొనకొండ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనే అభిప్రాయం కూడా అధికారుల్లో వ్యక్తమౌతోంది. వినియోగంలో లేని దొనకొండ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం వల్ల కొత్తగా మరొకటి నిర్మించాల్సిన అవసరం ఉండదని స్థానికులు సైతం సూచిస్తున్నారు.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనే దీన్ని ఈ విమానాశ్రయాన్ని నిర్మించారని, 1970 వరకు విమానాలు రాకపోకలు సాగించేవని స్థానికులు చెబుతున్నారు. ఉడాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినప్పటికీ.. సాధ్యపడలేదు. జిల్లాలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించడానికి బదులుగా అవే నిధులతో దొనకొండను డెవలప్ చేయవచ్చనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తోన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+