మార్కాపురం ఆస్పత్రి నుండి పసికందు అపహరణ , బుర్ఖాతో వచ్చి .. సీసీ టీవీ ఫుటేజ్ లో షాకింగ్ దృశ్యాలు !!

అభం శుభం తెలియని, అసలు లోకమే తెలియని పసికందులు అపహరణలకు గురవుతున్నారు . చిన్నారుల అపహరణలపై ఆసుపత్రి వర్గాలను ఎంతగా అలర్ట్ చేస్తున్నా ఎక్కడో ఒకచోట పసికందుల అపహరణ కొనసాగుతూనే ఉంది. ఆసుపత్రుల నుండి చిన్నారులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోతున్న ఘటనలు తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురం వైద్యశాలలో అలాంటి ఘటన చోటు చేసుకుంది.

 నాలుగురోజుల పసికందు మాయం

నాలుగురోజుల పసికందు మాయం

ప్రకాశం జిల్లాలో నాలుగు రోజుల పసికందు ఆసుపత్రి నుండి అపహరణకు గురైంది. మార్కాపురం ఏరియా హాస్పిటల్ లో జరిగిన ఈ సంఘటన ఆసుపత్రి వర్గాలను షాక్ కు గురి చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే గుంటూరు జిల్లా కారంపూడి దగ్గరలోని బుట్టువారి పల్లి గ్రామానికి చెందిన గర్భిణీ కోమలి కాన్పు కోసం, మార్కాపురం మండలంలోని కోలాభీమునిపాడులో తన పుట్టింటికి వచ్చింది. ప్రసవ నొప్పులు రావడంతో ఐదు రోజుల క్రితం కాన్పు కోసం మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కోమలిని చేర్పించారు. అక్కడ కోమలి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పాపను అపహరించుకుపోయారన్న తల్లిదండ్రులు

ఈరోజు కోమలి ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ కావాల్సి ఉంది . కానీ పాపకు కామెర్లు కావడంతో వైద్యుల సూచన మేరకు పాపను అబ్జర్వేషన్లో ఉంచారు. పాప దగ్గర ఉన్న తల్లిదండ్రులను నర్సు బయటకు పంపించగా, ఈ లోపు పాపని ఎవరో అపహరించారు. ఆస్పత్రిలో పని చేస్తున్న సిబ్బంది ముందే పాపను ఓ మహిళ ఎత్తుకెళ్ళింది. పాప ఉన్న గదిలోకి వెళ్ళి చూసిన తల్లిదండ్రులు పాప లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ పాపను ఎవరు అపహరించుకుపోయారు అంటూ ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా మా పాపను మాకు ఇప్పించండి అంటూ తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీస్తున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు .. సీసీటీవీ ఫుటేజ్ లో షాకింగ్ దృశ్యాలు

పాప అదృశ్యం నేపథ్యంలో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక మహిళ పాపను ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. అయితే సదరు మహిళ ఎవరూ గుర్తుపట్టకుండా బుర్ఖా ధరించి వున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పాపను ఎత్తుకుని చకచకా సదరు మహిళ బయటకు వెళ్తున్న దృశ్యాలు సిసి టీవీ ఫుటేజ్ లో లభించాయి. తన బిడ్డను తనకు ఇప్పించాలని తల్లి కన్నీరు మున్నీరుగా రోదిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ లో పాపని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు నమోదైన నేపథ్యంలో సదరు మహిళను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు.

ప్రత్యే బృందాలతో గాలింపు.. బుర్ఖాలో వచ్చి పాపను అపహరించింది ఎవరు?


ప్రత్యేక బృందాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. తల్లి కోమలితో పాటుగా ఆసుపత్రి సిబ్బందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అసలు పాపని ఎత్తుకు వెళ్ళింది ఎవరు ? పాపని ఎత్తుకెళ్లిన మహిళకు, పాప కుటుంబానికి ఏమైనా సంబంధం ఉందా ? లేదా శిశు విక్రయాల కోసం ఎవరైనా మహిళ ఈ దురాగతానికి పాల్పడిందా ? బుర్ఖాలో వచ్చి పాపను అపహరించింది ఎవరు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, పుట్టిన నాలుగు రోజులకే బిడ్డ దూరం కావడంతో శోకసంద్రంలో మునిగిపోయింది. తన బిడ్డ తిరిగి తన చెంతకు చేరుతుందో లేదో అన్న ఆవేదనలో ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+