ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీలో చేరిన కరణం వెంకటేష్... వెనక్కు తగ్గిన బలరాం .. రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో కరణం బలరాం చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. ఇక ఆయన కూడా వైసీపీలో చేరతానని ప్రకటించారు . కానీ ఆయన వైసీపీలో చేరకుండా వెనక్కు తగ్గారు. ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి తమ మద్దతు తెలిపిన కరణం బలరాం పార్టీలో చేరలేదు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్ మాత్రమే పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

వైసీపీలోకి కరణం బలరాం .. చంద్రబాబు ఎమర్జెన్సీ మీటింగ్.. చీరాల ఇంచార్జ్ గా యడం బాలాజీవైసీపీలోకి కరణం బలరాం .. చంద్రబాబు ఎమర్జెన్సీ మీటింగ్.. చీరాల ఇంచార్జ్ గా యడం బాలాజీ

వైసీపీలో చేరకుండా వెనక్కు తగ్గిన కరణం బలరాం .. ఎందుకంటే

వైసీపీలో చేరకుండా వెనక్కు తగ్గిన కరణం బలరాం .. ఎందుకంటే

కరణం బలరాం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ , మద్దాలి గిరిల బాటలో పార్టీలో చేరకుండా పార్టీకి సన్నిహితంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ చేరిక నుండి వెనక్కు తగ్గారు. అయితే పార్టీలో చేరితే పదవులకి రాజీనామా చేయాలని జగన్ ముందు నుండే చెబుతుండడంతో ఆయన కూడా వల్లభనేని వంశీ, మద్దాలి గిరిల బాటలోనే పార్టీలో చేరకుండా బయట నుండి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.

వైసీపీలో చేరిన బలరాం తనయుడు వెంకటేష్ ... మద్దతు తెలిపిన బలరాం

వైసీపీలో చేరిన బలరాం తనయుడు వెంకటేష్ ... మద్దతు తెలిపిన బలరాం

అయితే ఈరోజు సీఎం జగన్ ను కలిసిన కరణం బలరాం, కరణం వెంకటేష్, పాలేటి రామారావులు తమ సంపూర్ణ మద్దతు వైసీపీకి ఉందని ప్రకటించారు. కరణం వెంకటేష్ వైసీపీలో చేరగా వైసీపీకి మద్దతిస్తానని సీఎంకు కరణం బలరాం చెప్పినట్టు చెబుతున్నారు. అయితే సీఎంను కలిశాక మీడియా ముందుకు రాని ఎమ్మెల్యే కరణం బలరాం సైలెంట్ గా ఉన్నారు. కేవలం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాల్సి వస్తుంది అన్న కారణంతోనే కరణం బలరాం పార్టీలో చేరలేదు .

జగన్ పాలనతో ఆకర్షితులయ్యే చేరామని ప్రకటన చేసిన వెంకటేష్

జగన్ పాలనతో ఆకర్షితులయ్యే చేరామని ప్రకటన చేసిన వెంకటేష్

ఇక వైసీపీ తీర్ధం పుచ్చుకున్న బలరాం తనయుడు కరణం వెంకటేష్ మాట్లాడుతూ జగన్ పాలన, సంక్షేమ పథకాల అమలు చూసి ఆకర్షితులమయ్యే పార్టీలోకి వచ్చామని, చీరాల నియోజకవర్గం అభివృద్దికి పాటుపడతామని పేర్కొన్నారు . పార్టీ అధినేత ఆదేశాల మేరకు పని చేస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామన్న ఆయన టీడీపీతో దశాబ్దాల అనుబంధం ఉందని పేర్కొన్నారు. పార్టీ మారినప్పుడు ఆ పార్టీపై విమర్శలు చేయటం మంచిదికాదని తమ అభిప్రాయం అని ఆయన తెలిపారు.

 పార్టీలో చేరకుండా మౌనం వహించిన బలరాం

పార్టీలో చేరకుండా మౌనం వహించిన బలరాం

బలరాం టీడీపీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అయినా ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారని ఇప్పుడు వైసీపీలో వీరు చేరటం శుభ పరిణామం అన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి . కానీ కరణం బలరాం మాత్రం అటు వైసీపీ గురించి కానీ , టీడీపీ గురించి కానీ ఏమీ మాట్లాడలేదు . జగన్ ను కలిసి మాట్లాడి తన మద్దతు తెలిపారు. పార్టీ కోసం పని చేస్తామని చెప్పారు.

English summary
TDP senior leader , MLA Karanam balaram supported ycp and not joined in YCP . karanam balaram's son karanam venkatesh joined in ycp in the presence of CM YS Jagan Mohan Reddy. At the Jagan residence in Tadepally,. today karanam balaram announced his joining in YCP . but he won't . because if he joined in ycp he has to resign his MLA post so, he didn't want to do that . He following the vallabhaneni vamshi and maddhali giri way .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X