రెడ్ బుక్ వేట మొదలు: వైసీపీ సీనియర్ నేతకు నోటీసులు
Chandrababu Naidu: ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.. విజయవాడలో చురుగ్గా సాగుతున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతోండటం ఇది రెండోసారి. మొత్తంగా నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు, రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారాయన. ఇప్పుడు మళ్లీ ఈ పదవిని అందుకోబోతోన్నారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 11: 20 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రమాణ స్వీకారం కోసం కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద గల ఖాళీ స్థలాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం అక్కడ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రమాణ స్వీకార ఏర్పాటు పనులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్.. పరిశీలించారు. పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఈ పరిస్థితుల్లో- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు నోటీసులు అందడం మొదలైంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు కారుమూరి వెంకటరెడ్డికి నోటీసులు అందాయి. ఒంగోలు పోలీసులు ఆయనకు ఈ నోటీసులను అందజేశారు. ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. ఒంగోలు వడ్డేపాలెంలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.
దామచర్ల సత్యనారాయణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంగోలు వన్ టౌన్ పోలీసులు కేసు పెట్టారు. ఐపీసీలోని సెక్షన్ 504, ఐటీ యాక్ట్‌లోని 66,66-బీ కింద ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. ఈ నెల 7వ తేదీన కారుమూరు వెంకటరెడ్డిపై దామచర్ల సత్యనారాయణ లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications