ఎస్ఈఓ కి అంతుచిక్కని వైరస్ .. ఇదంతా చంద్రబాబు ఎఫెక్ట్ : మంత్రి సురేష్ ఫైర్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్షన్ కమీషన్ వాయిదా వెయ్యటం కరోనాను మించి కలకలం రేపుతుంది. ఈనెల 21 నుంచి ఏపిలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉండగా ఏపీలో తాజా పరిస్థితుల నేపధ్యంలో ఊహించని విధంగా ఎన్నికల కమీషన్ ఎన్నికలను వాయిదా వెయ్యటం వైసీపీ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారింది . ఇక దీనిపై వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమీషనర్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇదంతా చంద్రబాబు కుట్ర అని మండిపడుతున్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అంతుపట్టని వైరస్ సోకిందన్న మంత్రి
ఇక తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అంతుపట్టని వైరస్ సోకిందని విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలను వాయిదా వేయించటం వెనుక పెద్ద కుట్ర ఉందని , టీడీపీ రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే క్రమంలోనే ఇదంతా చేశారని ఆరోపించారు. ఎన్నికలను వాయిదా వేయించడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులను అడ్డుకోవాలన్నదే ప్రతిపక్షాల కుట్ర అని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు.
Recommended Video


ఇదంతా చంద్రబాబు ఎన్నికలను ఆపేందుకు చేసిన కుట్ర
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఒక్క కరోనా పాజిటివ్ నమోదు అయ్యిందని, కరోనా వైరస్‌ను నియంత్రించటానికి , ఎదుర్కోనేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆయన కావాలనే ఇదంతా చేశారని చెప్పుకొచ్చారు. అసలు పెద్దగా ఏపీలో కరోనా ప్రభావం లేకుండానే ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయాలని రమేష్‌కుమార్ ఎలా నిర్థారణకు వచ్చారని సురేష్ ప్రశ్నించారు. ఇక ఇదంతా చేసింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు.

వ్యవస్థలను మేనేజ్ చేయటంతో చంద్రబాబు దిట్ట
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి చంద్రబాబు చేసిన కుట్ర అని పేర్కొన్న మంత్రి సురేష్ ఇక చంద్రబాబుతో పాటు ఎవరెవరు చేతులు కలిపారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటంతో చంద్రబాబు దిట్ట అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు . ఎన్నికలు పూర్తి కాకుంటే కేంద్రం నుండి వచ్చే నిధులకు ఆటంకం కలుగుతుందని అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం వల్ల పేదలు ఇబ్బందులు పడతారని తెలిపారు. ఎన్నికల్లో మరోసారి చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్న మంత్రి కరోనాను మించిన అంతు చిక్కని వైరస్ ఎలక్షన్ కమీషనర్ కు సోకిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications