ప్రకాశం జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతుందా ? మే 30 కోసమే ఆసక్తికర సమీకరణాలు ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా , మరోపక్క రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలోని అధికార వైసిపి టిడిపి ముఖ్య నేతల పై దృష్టి పెట్టి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది అన్న సంకేతాలు వైసీపీ నేతల మాటలలో స్పష్టంగా అర్థం అవుతోంది. మే 30 వ తేదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కావటంతో ఆ రోజున టీడీపీకి షాక్ ఇవ్వటానికి వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది .
జగన్ గారికి ఈ అలవాటు ఇంకా పోలేదన్న నారా లోకేష్ .. ఏం విషయంలోనో చెప్పారుగా !!

చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న వైసీపీ నాయకులు
వైసిపి ప్రకాశం జిల్లాలో టీడీపీకి చెక్ పెట్టాలని భావిస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు పలుమార్లు టిడిపి నేతలతో చర్చలు జరిపినట్లు గా వార్తలు వచ్చాయి. ఇక తాజా రాజకీయ సమీకరణాల్లో టిడిపి నేతలు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఏపీలో టీడీపీ ప్రతిపక్ష హోదా గల్లంతు కావటం ఖాయం. చంద్రబాబుకు పెద్ద షాక్ ఇవ్వాలన్న ఆలోచనతోనే వైసీపీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు , మాజీలు , ముఖ్య నాయకులు టార్గెట్
ప్రకాశం జిల్లాకు సంబంధించిన టిడిపి ముఖ్య నాయకులను అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి వైసిపి నాయకత్వం పావులు కదుపుతోంది. పర్చూరు టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్,మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు లతో పాటు టిడిపి నేతలు కొందరు ముఖ్య నాయకులను వైసీపీలోకి తీసుకురావడం కోసం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపినట్లు గా సమాచారం.అయితే ఈ నెల మే 27వ తేదీన కానీ లేదా ఈ నెల 30న కానీ పర్చూరు,అద్దంకి ఎమ్మెల్యేలు వైసీపీలో చేరే అవకాశముందని సమాచారం.

పావులు కదుపుతున్న కరణం బలరాం .. టీడీపీ నేతల ఊగిసలాట
ఇప్పటికే టిడిపి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తన కుమారుడు కరణం వెంకటేష్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేర్పించారు. ఇక టీడీపీకి దూరంగా ఉంటూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఆయన పనిచేస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులను రాజీనామా చేయించి వైసిపిలో చేర్పించడం కోసం కరణం బలరాం పావులు కదుపుతున్నట్లు గా తెలుస్తుంది. అయితే కొందరు టీడీపీ ముఖ్య నేతలు పార్టీ మార్పు పై ఇంకా డైలమా లోనే ఉన్నారు. అందుకు కారణం లేకపోలేదు. పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాత్రమే వైసిపి తీర్థం పుచ్చుకోవాలని ఉంటుంది. ఇక ఈ నిబంధన నేపథ్యంలోనే టిడిపి ఎమ్మెల్యేలు ఊగిసలాడుతున్నారని సమాచారం.

సీఎంగా బాధ్యతలు చేపట్టి మే 30 కి ఏడాది పూర్తి సందర్భంగా టీడీపీకి షాక్
మరోవైపు టిడిపి ఎమ్మెల్యేల పార్టీ మార్పు పై టిడిపి అధిష్ఠానం కూడా దృష్టి సారించింది. ఇప్పటికే అధినేత చంద్రబాబు వారితో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. మే 30వ తేదీకి వైయస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని టార్గెట్ తో వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు.
Recommended Video

టెన్షన్లో టీడీపీ .. కరోనా లాక్ డౌన్ టైంలోనూ హాట్ హాట్ గా ఏపీ రాజకీయం
ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్లలో ముగ్గురు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరో ముగ్గురు పార్టీని వీడి వెళితే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోతుంది. ఇక జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే టిడిపి కి గట్టి షాక్ ఇవ్వాలనుకున్న వైసీపీ నేతలు కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీని టెన్షన్ పడుతున్నారు. ఏది ఏమైనా ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణాల పై మరో పది రోజుల్లో క్లారిటీ రానుంది.