రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ ఐదింతలు ఎక్కువే మాట్లాడారు, జగన్‌కు మంచి ఛాన్స్: ఉండవల్లి అరుణ్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల సమావేశమయ్యారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆ సమావేశానికి సంబంధించిన వివరాలను సోమవారం ఉండవల్లి అరుణ్ రాజమహేంద్రవరంలో మీడియాకు వెల్లడించారు. కేసీఆర్ ఫోన్ చేసి పిలిస్తేనే భేటీ అయ్యాన‌ని చెప్పారు. త‌న‌ను మంత్రి హరీశ్ రావు రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. హ‌రీశ్‌తోపాటు మ‌రో మంత్రి, ఓ ఎంపీ పాల్గొన్నార‌ని చెప్పారు. తమతో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కూడా అక్క‌డే ఉన్నార‌ని తెలిపారు. పీకే చ‌ర్చ‌లో పాలుపంచుకోలేద‌ని తెలిపారు.

ముందువరసలో కేసీఆర్

ముందువరసలో కేసీఆర్


బీఆర్ఎస్ గురించి మాత్రం ప్ర‌స్తావ‌న రాలేద‌న్నారు. దేశంలో మోడీ పాల‌న‌ను వ్య‌తిరేకించే వారిలో కేసీఆరే బ‌ల‌మైన నేత‌గా ఉన్నార‌ని వివరించారు. తాను బీజేపీకి వ్య‌తిరేకం కాద‌ని.. ఆ పార్టీ విధానాలతో వ్య‌తిరేకిస్తాన‌ని చెప్పారు. బీజేపీ విధానాలు ఇప్పుడున్న‌ట్టు మ‌రింత మేర పెరిగితే ప్ర‌మాద‌మేన‌ని చెప్పారు. దీనిపై ప్ర‌ధానంగా చ‌ర్చించుకున్నామ‌న్నారు. కేంద్రంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసే దిశ‌గా కేసీఆర్ సుదీర్ఘ క‌స‌ర‌త్తు చేశార‌ని వివరించారు. బీజేపీపై కేసీఆర్‌తోపాటు త‌న‌దీ ఒక‌టే అభిప్రాయ‌మ‌ని చెప్పారు.

 కేసీఆర్ వెజ్ తిన్నారు..

కేసీఆర్ వెజ్ తిన్నారు..


త‌న‌ను కేసీఆర్ ఆహ్వానిస్తే... సీఎంవో నుంచి వెజ్ తింటానా? నాన్ వెజ్ తింటానా?అంటూ ఆరా తీసింద‌ని చెప్పారు. కేసీఆర్ కూడా వెజిటేరియ‌నే తిన్నార‌ని చెప్పారు. ఆదివారం నాన్ వెజిటేరియ‌న్లు మాంసాహారం తినేందుకు ఆస‌క్తి చూపుతార‌ని తెలిపారు. కేసీఆర్ ఏం తింటారో త‌న‌కు తెలియ‌ద‌ని, త‌నతో క‌లిసి వెజ్ మాత్ర‌మే తిన్నార‌ని చెప్పారు. ప్ర‌శాంత్ కిశోర్ కూడా త‌మ‌తో క‌లిసి లంచ్ చేశార‌ని చెప్పారు. తాను అర‌గంట మాట్లాడితే.. కేసీఆర్ రెండున్న‌ర గంట‌లపాటు మాట్లాడార‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు.

వైసీపీకి మంచి అవకాశం

వైసీపీకి మంచి అవకాశం


దీంతోపాటు ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లు దిశ‌గా బీజేపీ ప్ర‌భుత్వం దిగివ‌చ్చేలా చేయ‌డం వంటి అంశాల‌పై వైసీపీకి ఇప్పుడు మంచి అవ‌కాశం ల‌భించింద‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చెప్పారు. వైసీపీకి ఇంత‌టి మంచి అవ‌కాశం మ‌రెప్పుడూ రాబోద‌న్నారు. రాష్ట్రప‌తి ఎన్నికల్లో బీజేపీకి స‌రిప‌డ బ‌లం లేద‌ని వివరించారు. ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు అవ‌స‌ర‌ం అని.. వైసీపీ చాలా పెద్ద పార్టీగా ఉంద‌న్నారు. వైసీపీకి ఏకంగా 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంద‌ని చెప్పారు. బీజేపీకి వైసీపీ అవ‌స‌రం చాలానే ఉంద‌న్నారు. బీజేపీ అభ్య‌ర్థి గెలుపులో వైసీపీ మ‌ద్ద‌తు కీల‌కం కానుంద‌ని చెప్పారు.

 బీజేపీకి తప్పదు

బీజేపీకి తప్పదు


మ‌ద్ద‌తు కావాలంటే...అడిగిన‌వ‌న్నీ చేయాల్సిందేన‌ని బీజేపీ మీద ఒత్తిడి చేసే అవకాశం వైసీపీకి ఉంద‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు. ఇప్పుడు వైసీపీ ఏది అడిగితే అది చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. ప‌రిస్థితిని అవ‌కాశంగా మ‌ల‌చుకుని ఏపీకి ప్ర‌త్యేక హోదాను సాధించే అవ‌కాశం వైసీపీకి ల‌భించింద‌ని చెప్పారు. జ‌గ‌న్ ఏది డిమాండ్ చేసినా బీజేపీ త‌లొగ్గి తీరుతుంద‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. అంతా జగన్ చేతిలో ఉందని చెప్పారు.

English summary
ap cm ys jagan have best choice to central for president of india elections senior leader undavalli arun kumar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X