Flash back 2019: గోదావరిలో లాంచీ మునక.. ప్రభుత్వ వైఫల్యానికి మచ్చుతునక!
రాజమహేంద్రవరం: మాటల కందని మహా విషాదం చోటు చేసుకున్న సంవత్సరం ఇది. 40 కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చి ఉదంతానికి సాక్షిగా నిలిచిన ఏడాది ఇది. ప్రభుత్వ వైఫల్యాలు, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపిన ఘటన ఇది. అదే- గోదావరిలో లాంచీ మునక. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద సుడులు తిరుగుతున్న గోదావరి నదిలో రాయల్ వశిష్ఠ లాంచీ ప్రమాదానికి గురైన విషాద గాథను ఇప్పట్లో మన రాష్ట్ర మరిచిపోలేరు.

పాపికొండల అందాలను తిలకించడానికి వెళ్లి..
పాపికొండల అందాలను తిలకించడానికి వెళ్లిన పర్యాటకుల్లో 40 మందికి పైగా ఇక వెనక్కి తిరిగి రాలేదు. నిండుగా ప్రవహిస్తోన్న గోదావరిలో జల సమాధి అయ్యారు. మృతుల్లో ఎక్కువమంది తెలంగాణకు చెందిన వారే. హైదరాబాద్, వరంగల్ లకు చెందిన పర్యాటకులు ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. సంఘటన చోటు చేసుకున్న రోజే 13 మృతదేహాలను వెలికి తీశారు సహాయక సిబ్బంది. అంతే. ఆ తరువాత ఒక్కో మృతదేహాన్ని గుర్తించడానికి రోజుల తరబడి గాలింపు చర్యలను కొనసాగించాల్సి వచ్చింది.

నెలన్నర రోజుల తరువాత..
గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ఠ బోటును వెలికి తీయడానికి నెలన్నర రోజుల సమయం పట్టిందంటే.. ప్రభుత్వ వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి అప్పటికే ఉగ్రరూపాన్ని సంతరించుకోవడం, మునిగిపోయిన తరువాత.. లాంచీ నిండా బురద పేరుకునిపోవడం వంటి కారణాల వల్ల దాన్ని అనుకున్న సమయానికి వెలికి తీయలేకపోయారు.

ధర్మాడి సత్యం ద్వారా..
నౌకాదళ సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, గజ ఈతగాళ్లు రోజుల తరబడి ప్రయత్నించినప్పటికీ.. లాంచీని వెలికి తీయలేకపోయారు. చివరికి కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ యజమాని ధర్మాడి సత్యం మీద ఆధారపడాల్సి వచ్చింది. బాలాజీ మెరైన్స్ నిపుణులు సైతం రాయల్ వశిష్ఠ లాంచీని తొలి ప్రయత్నాల్లో వెలికి తీయలేకపోయారు. చివరికి- వారు కూడా స్కూబా డైవర్ల ద్వారా బోటును వెలికి తీయగలిగారు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా లాంచీని వెలికి తీయాల్సి రావడం.. వ్యవస్థ లోపాన్ని ఎత్తి చూపినట్టయింది.

మృతదేహాలను గుర్తించలేని దుస్థితి..
ప్రమాదం చోటు చేసుకున్న సుమారు నెలన్నర రోజుల తరువాత కొన్ని మృతదేహాలు వెలికి తీశారు. లాంచీతో సహా అవి వెలికి వచ్చాయి. కుళ్లిన స్థితిలో వాటిని స్వాధీనం చేసుకున్నారు. లాంచీ శకలాల మధ్య అస్తిపంజరాలుగా మారిన మృతదేహాలు ఎవరివో కూడా గుర్తించలేని దుస్థితిని అనుభవించారు కుటుంబ సభ్యులు. ఇప్పటికి కూడా సుమారు 15 మంది పర్యాటకుల జాడ తెలియ రాలేదు. వారంతా మరణించి ఉంటారని నిర్ధారించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications