పవన్ పోటీ అక్కడి నుండేనా : పెరుగుతున్న ఒత్తిడి : జగన్ -పవన్ లక్ష్యం ఆ జిల్లానే..!
జనసేన అధినేత పవన్ కళ్యాన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. మరి ఎక్కడ నుండి బరిలోకి దిగుతారు. పవ న్ తమ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అనేక ప్రాంతాల నుండి ఒత్తిడి పెరుగుతోంది. అయితే, సవన్ మాత్రం ఈ విషయంలో వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సమాచారం. దీంతో..పవన్ పోటీ ఆ నియోజక వర్గం నుండి పో టీ చేయటం ఖాయమని చెబుతున్నారు...దీని ద్వారా ఆ జిల్లాలో పూర్తిగా పట్టు సాధించాలని లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో జగన్ సైతం అక్కడ పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు..

పవన్ పోటీ పై ఆసక్తి గా..
జనసేన అధినేత పవన్ కళ్యాన్ తమ జిల్లాల నుండి పోటీ చేయాలని అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. ప్రత్యేక హోదా పై సభల్లో భాగంగా అనంతపురం జిల్లాలో జరిగిన సభలో పవన్ కళ్యాన్ తాను అనంతపురం నుండే బరిలోకి దిగుతానని సంకేతాలు ఇచ్చారు. దీంతో, వపన్ రాయలసీమ నుండే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇక, తాజాగా విశాఖ జిల్లాలో పర్యటన సమయంలో చౌడవరం నుండి పోటీ చేయాలని పవన్ ను స్థానిక నేతలు కోరారు. అప్పుడు కూడా అది పార్టీ నిర్ణ యిస్తుందని..ఆ నిర్ణయానికి అనుగుణంగానే పోటీ చేస్తానని పవన్ తేల్చి చెప్పారు. ఇదే సమయం లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి పోటీకి పవన్ ఆసక్తిగా ఉన్నారని ప్రచారం జరిగింది. 2009 లో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పాలకొల్లు నుండి ఓటీ చేసి ఓడిపోయారు. తిరుపతి నుండి గెలిచారు. దీంతో.. ఈ సారి పవన్ పాలకొ ల్లు నియోజకవర్గం నుండి పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్నట్లు ప్రచారం.

పిఠాపురం వైపు పవన్ చూపు...!
ఇక, ఏపి రాజకీయాల్లో తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ జిల్లాలో ఎవరు అధిక స్థానాలు గె లిస్తే వారు అధికారంలోకి వస్తారని సెంటిమెంట్ ఉంది. ఈ సారి తూర్పు గోదావరి జిల్లా పై పవన్ ప్రత్యేకంగా దృష్టి సా రించారు. దాదాపు ప్రతీ నియోజకవర్గంలోనూ పర్యటించారు. ఈ సారి పవన్ ఇదే జిల్లా పిఠాపురం నుండి పోటీ చేయాల నే ఆలోచనతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నియోజకవర్గంలో సమస్యల..సమీకరణాల పై పవన్ ప్రత్యేకంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి ప్రజారాజ్యం అభ్యర్ది వంగా గీత గెలిచారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో టిడిపి రెబల్ అభ్యర్ధి వర్మ స్వతంత్ర అభ్యర్దిగా గెలిచారు. వచ్చే ఎ న్నికల్లో పవన్ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయటానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక్కడ పోటీ చేయటం ద్వా రా ఆ ప్రభావం జిల్లా పై ఉంటుందని..ఫలితం అధిక స్థానాలు గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

జగన్ -పవన్ లక్ష్యం ఆ జిల్లాలే..
2014 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని వైసిపి ఇప్పుడు అక్కడ దృష్టి పెట్టింది. ఈ సారి ఉభయ గోదావరి జిల్లాల్లో జెండా ఎగరేయాలని వ్యూహాలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే పవన్ తన సత్తా చాటారు. ఇక, ఎన్నికల కోసం అభ్యర్ధుల విషయంలోనూ ఓ అంచనాకు వచ్చారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్య ర్థిగా ఆకుల సత్యనారాయణ పేరును ప్రకటించే అవకాశముంది. రాజమహేంద్రవరం రూరల్ నుంచి కందుల దుర్గేష్, తుని నుంచి రాజా అశోక్‌బాబు, మండపేట నుంచి దొమ్మేటి వెంకటేశ్వర్లు, కాకినాడ రూరల్ నుంచి అనిశెట్టి బుల్లె బ్బాయి, పి.గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ పేర్లు దాదాపు ఖరారయ్యా యి. ఇక, వపన్ సైతం పిఠాపురం నుండి పోటీ చేస్తే..ఆ ప్రభావం గోదావరి జిల్లాల పై ఉంటుందని అంచనా. ఇదే సమయం లో జగన్ సైతం అక్కడ అభ్యర్ధుల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. మరి..అధికారంలో ఉన్న టిడిపి ఇక్కడ సమీకరణాలనే నమ్ముకుంది. మరి..జగన్ - పవన్ లలో ఎవరి వ్యూహాలు ఫలితాలిస్తాయో చూడాలి..
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications