కోడెల మృతిపై స్పందించిన రోజా .. చంద్రబాబుపై సంచలన ఆరోపణలు
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని హఠాన్మరణం తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. రాజకీయ కక్ష సాధింపు కోడెల మరణానికి కారణమని టిడిపి నేతలు మండిపడుతున్నారు. ఇక టిడిపి నేతల మాటలను వైసీపీ నేతలు తిప్పి కొడుతున్నారు.తాజాగా రోజా కోడెల మృతికి చంద్రబాబు కారణం అని ఆరోపణలు చేస్తారు.

ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం .. కోడెల మరణంతో టీడీపీ , వైసీపీ మధ్య మాటల యుద్ధం
ఏపీ రాజకీయాల్లో కోడెల మరణం ఊహించని పరిణామం.రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న ఆయన అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు.టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై పలు కేసులను నమోదు చేసి వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వేధింపులకు గురి చేసిందని దేశంలో ఎక్కడా లేనివిధంగా వైసిపి చేసిన హత్య అని తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం వైసీపీ పై నిప్పులు చెరుగుతున్నారు.అయితే వరుస కేసుల విషయంలో మానసికంగా బాగా కుంగిపోయిన కోడెల తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చానీయాంశంగా మారింది.

కోడెల మృతిపై రోజా .. చంద్రబాబు అవమానమే కోడెలను క్రుంగదీసిందన్న రోజా
కోడెల ఆత్మహత్య పెద్ద రాజకీయ దుమారం రేపింది. టీడీపీ చేస్తున్న విమర్శలను వైసీపీ నేతలు గట్టిగానే తిప్పికొడుతున్నారు.కోడెల మరణంపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకులైన చంద్రబాబు నాయుడే కోడెల మరణానికి కారణమని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.కోడెల వల్ల ఇబ్బంది పడిన వారు కేసులు పెట్టడంతో ఆయన చంద్రబాబును కలవాలని ప్రయత్నించారని, అయినా చంద్రబాబు మాత్రం ఆయన నన్ను కలవకుండా తీవ్రంగా అవమానించారు అంటూ ఆరోపించారు రోజా.

ఎన్టీఆర్ , రాధా వంటి నాయకుల మరణం బాబు కుట్ర వల్లే .. ఇప్పుడు కోడెల కూడా .. అన్న రోజా
సొంత మామ ఎన్టీఆర్ , వంగవీటి రంగా వంటి వ్యక్తుల మరణం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని పేర్కొన్న రోజా ఇప్పుడు కోడెల మృతి విషయంలో కూడా చంద్రబాబు హస్తం ఖచ్చితంగా ఉందని విమర్శించారు . కోడెలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టలేదని, పేర్కొన్న రోజా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసులు నమోదయ్యాయని తెలిపారు. తాను నమ్మిన నాయకుడు తనను అవమానించిన ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా రోజా తేల్చేశారు.ప్రస్తుతం ఏపీలో కోడెల ఆత్మహత్య విషయంలో టీడీపీ , వైసీపీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కింది .
-
మావిగన్ పై స్పందన చూసి చంద్రబాబుకు వణుకుపుడుతోంది! -
Amaravati: అమరావతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల -
సీ షోర్ హైవేపై కేంద్రానికి ప్రతిపాదన పంపిన చంద్రబాబు.. ప్లాన్ ఇదే! -
పంచాయతీ కార్యదర్శులకు చంద్రబాబు షాక్-తాజా ఉత్తర్వులు..! -
ఏపీలోకి తమిళనాడు, పుదుచ్చేరి బోట్లు-చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన!












Click it and Unblock the Notifications