హరీశ్ వర్సెస్ బొత్స: టీచర్ల అంశంపై రగడ, అటాక్- కౌంటర్ అటాక్
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన అప్పుడప్పుడు జగడాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నీటి కోసం ఆ గొడవలు మరీ ఎక్కువ. తాజాగా మంత్రి హరీశ్ రావు ఏపీ టీచర్ల అంశాన్ని ప్రస్తావించగా.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ అటాక్ ఇచ్చారు. వారి పరిస్థితి బానే ఉందని తేల్చిచెప్పారు.

హరీశ్ రావు కామెంట్స్..
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. గురువారం సిద్ధిపేటలో ఉపాధ్యాయ సంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల పట్ల ఏపీ సర్కార్ కర్కశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ఉపాధ్యాయులతో తమ ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఏపీలో ఉపాధ్యాయులపై కేసులు పెడుతున్న ప్రభుత్వం వారిని జైల్లో వేస్తోందని కూడా ఆరోపించారు.

తెలంగాణ భేష్
గత ఐదేళ్లలో ఉద్యోగులకు 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణేనని హరీశ్ రావు గుర్తుచేశారు. ఇంత మేరకు ఫిట్‌మెంట్ దేశంలో ఎక్కడైనా వచ్చిందా? అని ప్రశ్నించారు.ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉందో గమనిస్తే... తెలంగాణలో తమ ప్రభుత్వం ఉద్యోగులతో ఎంత ఫ్రెండ్లీగా ఉందనే విషయం అర్థమవుతుందని అన్నారు.

కర్కశంగా ప్రవర్తిస్తున్నారే..
ఉపాధ్యాయులపై ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని మంత్రి తన్నీరు హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ అటాక్ ఇచ్చారు. వాస్తవాలేమిటో తెలుసుకోకుండా హరీశ్ రావు మాట్లాడటం సరికాదని బొత్స సత్యనారాయణ సూచించారు. హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

సంతోషంగా ఉన్నారే..
ఏపీలో ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారని బొత్స అన్నారు. హరీశ్ రావు ఒక సారి ఏపీకి రావాలని, ఇక్కడి టీచర్లతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ, ఏపీ పీఆర్సీలు పక్కపక్కనే పట్టుకుని చూస్తే తేడా తెలుస్తుందన్నారు. ఇలా ఒకరిపై మరొకరు కామెంట్ చేసుకున్నారు.












Click it and Unblock the Notifications