వారే పార్టీల వైపు: సిమ్ కార్డులిస్తానని హరికృష్ణ సవాల్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో తాను మిలాకత్ అయినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ శనివారం మండిపడిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అవసరమైతే తమ సిమ్ కార్డు వివరాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తనపై ప్రచారం చేస్తున్న వారు వారి సిమ్ కార్డుల వివరాలు ఇవ్వగలరా అని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన సమయంలో ఆయన సవాల్ చేశారు.

Chandrababu Naidu

హరికృష్ణ తెలంగాణకు మొదట మద్దతు పలికారని, ఆ తర్వాత ఆయన తన విధానం మార్చుకున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు చెప్పిన దాని పైన కూడా హరికృష్ణ సవాల్ చేశారు.

తాను తొలి నుండి సమైక్యవాదం వినిపిస్తున్నానని తెలిపారు. తాను తెలంగాణకు ఎప్పుడు మద్దతు పలకలేదన్నారు. తాను తెలంగాణకు ఎప్పుడైనా మద్దతిచ్చినట్లుగా ఎవరైనా ప్రూవ్ చేయగలరా అని సవాల్ విసిరారు. తెలంగాణ విషయంలో తనను ఏ మకిటీ కూడా సంప్రదించలేదని చెప్పారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగా వ్యతిరేక ప్రచారం జరుగుతోందని, తాను ఏ విషయం పైన అయినా చర్చకు సిద్ధమన్నారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+