శ్రీకాకుళంలో సిగ్నల్ లేక ఆగిన రైలు, ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో గల బాతువా సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. రైలు నిలిపివేయడంతో సమస్య వచ్చింది. సాంకేతిక సమస్యతో గౌహతి ఎక్స్ ప్రెస్ నిలిపివేశారు. గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ కంపార్ట్మెంట్ నుండి పాసింజర్లు దిగి వేరే ట్రాక్ పై ఉండగా.. అనుకోకుండా అదే లైన్‌లో భువనేశ్వర్ సికింద్రాబాద్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. ట్రాక్ పై ఉన్నవారిని ఢీ కొట్టింది. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది.

ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రాంతం అంతా హాహాకారాలతో హోరెత్తింది. క్షతగాత్రులను సమీపంలో గల ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన వెంటనే రైల్వే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications