పతివ్రత పరమాన్నం వండితే.. పవన్ పై చెలరేగిన మంత్రి అమర్నాథ్..!
శ్రీకాకుళం రణస్థలం వేదికగా గురువారం జరిగిన జనసేన యువశక్తి సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై పలువురు మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో క్లారిటీ మిస్ అయిందని మొదలెట్టిన గుడివాడ అమర్నాథ్... ఎవరిని తిట్టనని తన ప్రసంగం మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్, ప్రతి ఒక్కరినీ తిట్టిపోశాడని చెప్పారు. పవన్ కళ్యాణ్ తన పార్టీని చంద్రసేనగా మార్చాలని హితవు పలికారు.
పవన్ రాజకీయాల్లో కచ్చితంగా ప్యాకేజీ స్టారే అని తీవ్ర విమర్శలు గుప్పించారు అమర్నాథ్. పవన్ లాంటి రాజకీయ వ్యభిచారి ప్రపంచంలోనే ఎవరూ ఉండరని ఆగ్రహం వ్యక్తం చేసిన అమర్నాథ్...పవన్ ఓ వైపు పోరాటం చేస్తానని చెబుతూనే మరోవైపు ఒంటరిగా పోరాటం చేస్తే వీరమరణం పొందుతామనే మాట మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ పార్టీకి ఒక విధానం లేదని చెప్పిన ఆయన.. జనసేనాని ఒక రాజకీయ వ్యభిచారని దుమ్మెత్తి పోశారు. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారులూ చల్లారలేదంటూ పవన్‌ను ఉద్దేశించి ఛలోక్తులు విసిరారు అమర్నాథ్.

తన కుటుంబం గురించి పవన్‌కు మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు మంత్రి అమర్నాథ్. తన అన్న పునాది రాళ్లు విడుదల కాకముందు నుంచే తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారే అని విమర్శించిన మంత్రి అమర్నాథ్... సభకు వచ్చిన జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వారిపై తనకు నమ్మకం లేదని చెప్పడం ఎలాంటి సంకేతాలిస్తున్నారని ప్రశ్నించారు. తనలా తాళం కొట్టే బ్యాచ్ తమ కుటుబంది కాదని అమర్నాథ్ చెప్పారు. త్రివిక్రమ్ రాసిన స్క్రిప్ట్ బాగానే వల్లెవేశారని చెప్పిన మంత్రి... సినిమా రైటర్లు స్క్రిప్ట్ సినిమాలకు పనికొస్తాయి కానీ రాజకీయాలకు కాదని అన్నారు. స్క్రిప్ట్ చదివేముందు ఒకసారి వాస్తవ పరిస్థితులపై అవగాహన తెచ్చుకుని ఉండి ఆ తర్వాత మాట్లాడి ఉంటే బాగుండేదని అమర్నాథ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ పార్టీకి సిద్ధాంతం విధానాలు లేవని.. ఎంతసేపు చంద్రబాబు పల్లకి మోస్తానని మాత్రమే చెబుతున్నారు కానీ తాను ఏం చేస్తాడన్నది చెప్పడం లేదన్నారు. కాపులమైన అంబటి రాంబాబు, తనపై హక్కు ఉందని పవన్ భావిస్తున్నట్లున్నారని అందుకే ప్రత్యేకించి తమనే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారని అమర్నాథ్ గుర్తుచేశారు. పోరాటం అన్న పవన్ కళ్యాణ్ చివరికి తన ఆరాటం ఏమైందో అర్థం కావడం లేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల్లోని డైలాగులు ఒకేసారి కలగలిపి చెప్పారు. దీంతో ఆయన ప్రసంగంలో క్లారిటీ తనకే లేదని మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు - పవన్ కళ్యాణ్‌లు హైదరాబాద్‌లో కలిసి నీకెంత నాకెంత, నీకెన్ని సీట్లు నాకెన్ని సీట్లు అన్న అంశం మాత్రమే మాట్లాడుకున్నారని అమర్నాథ్ చెప్పారు. దేశం గురించి మాట్లాడుకున్నారని పవన్ చెప్పడం అదికూడా చంద్రబాబుతో ఈ విషయం చర్చించారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఐటీశాఖ మంత్రి పేరు తెలియదని చెప్పారని, పోనీ తన ముగ్గురు భార్యల పేరైనా టక్కున చెప్పగలరా అని వ్యక్తిగతంగా మంత్రి అమర్నాథ్ జనసేనానిని టార్గెట్ చేశారు. జనసేన కార్యకర్తలకు పవన్ ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని ప్రశ్నించిన మంత్రి అమర్నాథ్... రేపు కార్యకర్తలు ఇంటికి వెళ్లి మూడు పెళ్లిళ్లు చేసుకోమని తమ నాయకుడు చెప్పారని అడగమంటారా అని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్‌కు ఉన్నది నారా వారి నరాలు, కమ్మని పసుపు రక్తం అని సెటైర్ వేశారు మంత్రి అమర్నాథ్. ఇవి ఉంచుకుని పవన్ కళ్యాణ్ నీతులు చెప్పడానికి తయారయ్యాడని విమర్శించారు. చివరకు జనసేనను నడపడం తన వల్ల కాదని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారని, చంద్రబాబు పల్లకిని మోయాలంటూ పిలుపునిచ్చారని వెల్లడించారు. సంక్రాంతి పండగకు ముందు వెళ్లి.. మామూళ్లు తీసుకుని ఆ తర్వాత డ్రామాను రక్తి కట్టిస్తాడని మంత్రి పవన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధైర్యవంతుడువని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎక్కడో ఒకసారైనా నిరూపించుకోవాలి కదా అని సవాల్ విసిరారు. ధైర్యవంతుడు ఎప్పుడూ బయటకు చెప్పుకోడని ఎద్దేవ చేశారు. అయితే నిరూపించుకోమన్నాము కదా అంటే పవన్ మరో పెళ్లి చేసుకుని ధైర్యవంతుడని నిరూపించుకుంటాడని మంత్రి సెటైర్లు వేశారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రసంగం మీద మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్లు గట్టిగా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications