శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా రూల్స్ బ్రేక్.. రూ.2 లక్షల ఫైన్... 20 మంది అని చెప్పి.. 250 మంది

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. వేడుకలు చేయాలనుకునేవారు తప్పనిసరిగా తహసీల్దార్ నుంచి పర్మిషన్ తీసుకోవాలని ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యూలర్‌లో తెలిపింది. చాలామంది ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.

రూ.2 లక్షల ఫైన్

రూ.2 లక్షల ఫైన్


కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి వేడుక నిర్వహించినందుకు అధికారులు రూ.2 లక్షలు ఫైన్ విధించారు. శ్రీకాకుళం జిల్లాలో ఘటన జరిగింది. పాతపట్నం మండలం చంద్రయ్యపేట గ్రామానికి చెందిన టీచర్ రాంబాబు తన పెళ్లి నిమిత్తం పాతపట్నం తహసీల్దార్ వద్ద పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ ఇచ్చే సమయంలో తహసీల్దార్ కరోనా నిబంధనలను రాంబాబుకు వివరించాడు.

20 మంది అని చెబితే.. 250 మంది

20 మంది అని చెబితే.. 250 మంది

పెళ్ళిలో 20 మంది మాత్రమే ఉండాలని తెలిపాడు. తహసీల్దార్ చెప్పినంత సేపు తల ఊపిన రాంబాబు. పెళ్లిరోజు నిబంధనలు తుంగలో తొక్కాడు. శుక్రవారం పెళ్లి జరుగుతుండగా పోలీసులు, రెవెన్యూ అధికారులు పెళ్లి వేడుక వద్దకు వెళ్లారు.పెళ్ళిలో సుమారు 250 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా నిబంధనలు ఉల్లగించినందుకు గాను రూ. 2 లక్షల ఫైన్ విధించారు.

Recommended Video

#Telangana : Need Justice For Teachers In Telangana - NSUI
రూల్స్ బ్రేక్ చేస్తే అంతే

రూల్స్ బ్రేక్ చేస్తే అంతే

కరోనా తీవ్రత అధికంగా ఉందని.. ప్రజలు అర్ధం చేసుకోవాలని సీఐ ఎండీ అమీర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ సమయంలో వైరస్ వేగంగా వ్యాపిస్తోందని.. అందుకే రూల్స్ బ్రేక్ చేయొద్దని నొక్కి వక్కానించారు. రూల్స్ బ్రేక్ చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని చెప్పారు.

English summary
teacher break the corona rules, officials fine rs.2 lakhs at srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X