చిక్కటి టీ కాచిన చంద్రబాబు
Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన మరో వాగ్దానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.
అధికారంలోకి రావడానికి ప్రచార సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్‌లో భాగమైన ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల హామీని ప్రారంభించింది. ఆ హామీ కార్యరూపాన్ని దాల్చింది. చెప్పినట్టే- దీపావళి పండగను పురస్కరించుకుని ఉచిత వంటగ్యాస్ సిలిండర్ల పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. లబ్దిదారులకు స్వయంగా వాటిని అందజేశారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఈదుపురం గ్రామంలో కొద్దిసేపటి కిందటే ఉచిత వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారాయన. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఇందులో పాల్గొన్నారు.
పథకాన్ని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు టీ మాస్టర్ అవతారం ఎత్తారు. ఈదుపురం గ్రామంలో లబ్దిదారు ఇంటికి వెళ్లారు. వారితో మాట్లాడారు. పేర్లు, ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాళ్ల ఇంట్లో ఉండే ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. కుటుంబ ఆదాయం ఎంత వస్తోందని ఇంట పెద్దను అడిగారు. మంత్రులందరూ మీ ఇంటికొచ్చారని, ఎలా అనిపిస్తోందని ప్రశ్నించారు.
శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పర్యటన. ఈదుపురం నుంచి దీపం 2.0 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం. మహిళ ఇంటికెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించిన సీఎం. ఉచిత సిలిండర్ బిగించి పొయ్యి వెలిగించిన చంద్రబాబు గారు. స్వయంగా టీ తయారు చేసిన ముఖ్యమంత్రి. చంద్రబాబు… pic.twitter.com/zNdEbJFnpx
— Telugu Desam Party (@JaiTDP) November 1, 2024
అనంతరం వంటగదిలోకి వెళ్లారాయన. స్వయంగా లైటర్‌తో స్టవ్ వెలిగించారు. అందులో పాలు పోసి, పౌడర్, చక్కెర వేసి చక్కటి టీని తయారు చేశారు. అనంతరం దాన్ని స్వయంగా ప్లేట్‌లో తీసుకెళ్లి అందరికీ ఇచ్చారు. టీ తయారవుతున్నంత సేపు ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చట్లాడారు. వారి కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు.
వంట చేయాలంటే చాలా కష్టపడేదానివి కదా? అంటూ ఆ మహిళను ఉద్దేశించి అన్నారు. అంతకుముందు కట్టెలపొయ్యి మీద వంట చేసుకునే వాళ్లమని ఆమె చంద్రబాబుకు బదులిచ్చారు. కడుపులోకి పొగ పోయ్యేదని, కళ్లు మండిపోయేవి కదా అని చంద్రబాబు అడిగారు. ఎక్కువ చక్కెర వేస్తే షుగర్ వస్తుందంటూ నవ్వుతూ చెప్పారు.












Click it and Unblock the Notifications