శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు షాక్ .. శంకుస్థాపన శిలా ఫలకంపై మంత్రి స్థానంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫోటో !

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు చేదు అనుభవం ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా జక్కం పేట మండలం రాజాపూడిలో రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన ధర్మాన కృష్ణదాస్ కు ఊహించని షాక్ తగిలింది. శిలాఫలకంపై కృష్ణదాస్ కు బదులు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫోటో చూసి ఆయన షాక్ తిన్నారు.

జక్కంపేట మండలం రాజపూడి గ్రామంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు చేదు అనుభవం

జక్కంపేట మండలం రాజపూడి గ్రామంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు చేదు అనుభవం


తూర్పుగోదావరి జిల్లా జక్కంపేట మండలం రాజపూడి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కి వెళ్ళిన మంత్రికి అక్కడి అధికారులు చేసిన నిర్వాకం తీవ్ర అసహనానికి గురి చేసింది. రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫోటో ఉండాల్సిన శిలా ఫలకంపై ఫోటో మారిపోయిందని లేటుగా గుర్తించిన అధికారులు నాలుక కరుచుకుని వెంటనే ధర్మాన ప్రసాదరావు ఫోటోకు పెయింట్ వేశారు. ఇక ఇదంతా చూసిన వైసీపీ నాయకులు అవాక్కయ్యారు. అధికారుల నిర్లక్ష్యం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రి ధర్మాన

తూర్పు గోదావరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రి ధర్మాన


ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎంగా, జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో గత రెండు రోజుల నుండి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి ఈరోజు అధికారుల నిర్వాకానికి అవాక్కయ్యారు. శంకుస్థాపన శిలాఫలకంపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు బదులుగా, ఆయన సోదరుడు కాంగ్రెస్ లో కీలకంగా పని చేసిన నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫోటోను ఏర్పాటు చేయడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు.

అధికారులపై మంత్రి సీరియస్ .. ధర్మాన ప్రసాద్ రావు ఫొటోకు పెయింట్ వేసిన అధికారులు

అధికారులపై మంత్రి సీరియస్ .. ధర్మాన ప్రసాద్ రావు ఫొటోకు పెయింట్ వేసిన అధికారులు


ఇక ధర్మాన ప్రసాదరావు , ధర్మాన కృష్ణదాస్ కు మధ్య విభేదాలు ఉన్న కారణంగా, ఇద్దరూ ఒకరి నొకరు శత్రువులుగా భావిస్తున్న నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ధర్మాన కృష్ణదాస్. అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో, అప్పటికప్పుడు ధర్మాన ప్రసాదరావు ఫోటోకి పెయింట్ వేసిన అధికారులు, మరలా కృష్ణదాస్ ఫోటోను ఏర్పాటు చేశారు. రాజాపూడి నుండి భూపతిపాలెం వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఫోటో లేకపోవటంతో శిలాఫలకం చూసి అక్కడ జనాలు నివ్వేరబోయారు.

శంకుస్థాపన కార్యక్రమంలో గందరగోళం .. వైసీపీ నేతల ఆగ్రహం

శంకుస్థాపన కార్యక్రమంలో గందరగోళం .. వైసీపీ నేతల ఆగ్రహం


ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వైసీపీ నేతలు కార్యకర్తలు అధికారులు నిర్లక్ష్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాసేపు శంకుస్థాపన కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. ఇక కొందరైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావును అధికారులు మర్చిపోలేక పోతున్నారు అంటూ సెటైర్లు వేశారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ ను గుర్తించటం లేదంటూ వ్యాఖ్యానించిన వారు సైతం లేకపోలేదు. ఇక ధర్మాన ప్రసాదరావు గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు.

English summary
AP Deputy minister was deeply impatient in the foundation program of road construction work in Rajapudi village in Jakkampeta mandal .Officials immediately painted a photo of Dharmana Prasadarao after realizing that the photo was changed instead of Dharmana Krishna das.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X