శ్రీకాకుళం జిల్లాలో ఉగ్రవాదుల కలకలం: లారీ డ్రైవర్ హత్య, నలుగురి అరెస్ట్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా శ్రీకాకుళంలో ఉగ్రవాదుల సంచారం కలకలం రేపింది. దీంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న ఓ వ్యక్తితోపాటు మరో ముగ్గురుని శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు.
అనంతరం వారిని విశాఖపట్నంకు తరలించారు. అక్కడే రహస్య ప్రదేశంలో ఉంచి వారిని విచారిస్తున్నారు. ముంబై నుంచి పశ్చిమబెంగాల్‌కు టమాటా లోడుతో వెళ్తున్న ఓ లారీని ఓ గుర్తు తెలియని వ్యక్తి అడ్డగించి అందులోని డ్రైవర్‌ను హత్య చేశాడు. ఆ హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఉగ్రవాద కోణం బయటపడింది. ఈ క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఆ లారీపై నిఘా పెట్టారు. ఎటువైపు వెళుతోందని ఆరా తీశారు.

ఈ నేపథ్యంలో విశాఖపట్నం పోలీసులను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి వద్ద పోలీసులకు నిక్కారు నిందితులు. కాగా, అదుపులోకి తీసుకున్న అనుమానిత ఉగ్రవాదిని చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన అష్రఫ్‌గా, మిగితా ముగ్గురు నిందితులను శరద్ అలీ, సయాద్ హసిం, షాజహాన్‌లుగా గుర్తించారు. వీరి అరెస్టులో సిమ్ కార్డు కీలకంగా మారింది.
ఐఎస్ఐ ప్రతినిధులు గతంలో వాడిన ఒక సెల్ సిమ్‌ను అష్రఫ్ ఉపయోగిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చినఎన్ఐఏ, పోలీసులు అధికారులు.. ఆ సిమ్ ఆధారంగానే అష్రాఫ్ తోపాటు మిగితా ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనేదానిపై ఎన్ఐఏ అధికారులు, పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications