శభాష్ ఎస్సై శిరీష: కాశీబుగ్గ కాప్‌పై విజయసాయిరెడ్డి ప్రశంసలు.. సేవా కార్యక్రమాల్లోనూ..
శాంతి భద్రతల పర్యవేక్షణే కాదు.. మానవత్వం ఉంది అని కూడా కొందరు పోలీసులు చాటుతున్నారు. నేరగాళ్లతో ఎంత కఠినంగా ఉంటామో.. చలించే సందర్భంలో మంచుకన్న త్వరగా కరుగుతామని రుజువు చేస్తున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ఓ వృద్దుడు చనిపోగా.. ఎవరూ మందుకు రాలేదు. మహిళ ఎస్సై అంత్యక్రియలు జరిపి తన మానవత్వాన్ని చాటారు. ఈ ఘటనతో ఎస్సై చర్యను అందరూ ప్రశంసిస్తున్నారు. డీజీపీ విష్ చేయగా.. తాజాగా వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. శభాష్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
గ్రేటర్ ఫలితాలే ఏపీ స్థానిక ఎన్నికల్లో రిపీట్, టీడీపీ ఖాతా తెరవకపోవడంపై విజయసాయిరెడ్డి..
పాడే మోసి..
ఖాకీలు అంటే సమాజంలో ఒక చులకన భావం ఉంది. గౌరవంతో పాటు మర్యాద ఉన్నా.. వారంటే ఎందుకో చిన్న చూపు. కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకోరు అనే ఆపవాదు ఉంది. అయితే ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో జనంతో వారు కలిసిపోతున్నారు. ఇటీవల శ్రీకాకుళంలో వృద్దుడు చనిపోయిన సంగతి తెలిసిందే. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పలాస కాశీబుగ్గ మహిళ ఎస్సై శిరీష ముందుకొచ్చారు. వృద్దుడి పాడే మోశారు.
నైనా గంగూలీ అందాల ఆరబోత.. కెమెరా ముందు గ్లామర్‌తో రెచ్చిపోయిన యువ బ్యూటీ
మచ్చు తునక ఇదీ..
ఏపీ పోలీసుల పనితీరుకు ఇదో మచ్చు తునక అని విజయసాయిరెడ్డి అభివర్ణించారు. అనాథ శవాన్ని తీసుకెళ్లేందుకు స్థానికులే నిరాకరించారని తెలిపారు. కానీ స్వయంగా పాడే మోసి శిరీష్ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఆమెకు అభినందనలను ట్వీట్ ద్వారా తెలియజేశారు. పోలీసులు అంటే శాంతి భద్రతలే కాదు.. సేవా కార్యక్రమాల్లోనూ ముందు ఉంటారని రుజువు చేశారు.

యాచకుడు మృతి
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు. స్ధానిక యాచకుడు అయిన ఆయన పంటపొలాల్లోకి వెళ్లి చనిపోయాడు. స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్ధానికంగా పొలాల్లో నుంచి సదరు మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చేందుకు సరైన సౌకర్యం లేదు. కరోనా పరిస్ధితుల నేపథ్యంలో అనుమానాస్పద మృతదేహం మోసుకొచ్చేందుకు ధైర్యం చేయలేదు.

కిలోమీటర్ మేర పయనం..
అక్కడ ఉన్న మృతదేహాన్ని బయటికి తెచ్చేందుకు స్ధానికులు సహకరించకపోవడంతో తానే ఆ పని చేయాలని ఎస్సై శిరీష నిర్ణయించుకున్నారు. దీంతో ఓ గుడ్డను స్ట్రెచర్ రూపంలో తయారు చేసుకుని మరో వ్యక్తితో కలిసి ఆ మృతదేహాన్ని కిలోమేటర్ మేర మోసుకెళ్లారు. ఊర్లోకి తీసుకెళ్లి స్ధానికంగా ఉన్న లలితా మెమోరియల్ ట్రస్టుకు అప్పగించారు. దీంతో వారు ఆ మృతదేహానికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. .