అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి, శీలానికి వెల కట్టారు

మహబూబ్ నగర్: పాలమూరు జిల్లా బాలానగర్ మండలంలోని ఓ తండాలో గిరిజన బాలిక పైన సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పైన ఓ యువకుడు మిత్రులతో కలిసి అయిదు రోజుల కిందట గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడని తెలుస్తోంది.

ఆ రోజు రాత్రి ఎవరు లేని ప్రదేశానికి తీసుకు వెళ్లిన యువకుడు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన మిత్రులను ఉసిగొల్పాడు. ఆ బాలిక స్పృహ తప్పి పడిపోయింది. బాలిక చనిపోయిందని భావించి పొలాల్లోని ఓ చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు.

10 class student gang raped

బయటకు వెళ్లిన ఆ అమ్మాయి ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. అర్ధరాత్రి ఎవరులేని ప్రాంతంలో చెట్టుకు కట్టేసి కనిపించింది. ఈ దారుణంపై అందరు గప్ చుప్ అయ్యారని సమాచారం. బాలిక తల్లిదండ్రులను ఒప్పించి బాలిక శీలానికి లక్ష రూపాయలు ఇస్తామని పెద్దలు రాజీ కుదిర్చినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+