తెలంగాణలో 100 శాతం తొలి డోసు పూర్తి, కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు, 3 నుంచి పిల్లలకు టీకాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కి చేరిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

62 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోలేదు

62 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోలేదు

తెలంగాణలోని 62 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోలేదని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని ఓ ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్, ఒక ప్రెగ్నెంట్ మహిళ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పటి వరకు 11,756 మందికి స్క్రీనింగ్ చేసినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

తెలంగాణలో 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ తొలి డోసు పూర్తి

తెలంగాణలో 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ తొలి డోసు పూర్తి

మరోవైపు, తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వందశాతం లక్ష్యం పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని, వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషి వల్లే లక్ష్యం పూర్తి చేయగలిగామన్నారు. వ్యాక్సినేషన్ పై మొదట్నుంచీ సీఎం ప్రత్యేక దృష్టి సారించి, స్వయంగా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారని మంత్రి తెలిపారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారని చెప్పారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు వ్యాక్సినేషన్ లో భాగస్వామ్యమయ్యాయని తెలిపారు. తెలంగాణలో 7970 వ్యాక్సినేషన్ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. కరోనాను అరికట్టడంలో వ్యాక్సినే సంజీవని అని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెండు విడతల్లో 5.55 కోట్ల డోసులు ఇవ్వాలిన తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందన్నారు.

జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ అంటూ హరీశ్ రావు

జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ అంటూ హరీశ్ రావు

ఇక, వచ్చే జనవరి 3వ తేదీ నుంచి తెలంగాణలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. 15-18 ఏళ్ల మధ్య ఉన్నవారికి టీకా వేస్తామన్నారు. కొవిన్ పోర్టల్ లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. హైదరాబాద్, పురపాలికల్లో కోవిన్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. పీహెచ్ సీలు, వైద్య కాలేజీల్లో టీకాలు వేయనున్నట్లు తెలిపారు. 2007 కంటే ముందు పుట్టిన పిల్లలకు వ్యాక్సిన్ వేస్తామన్నారు. అర్హులైన పిల్లలందరికీ కోవాగ్జిన్ టీకా వేస్తామని, కోవాగ్జిన్ టీకాను కేంద్రం సూచించిందని తెలిపారు. రాష్ట్రంలో 15-18 ఏళ్ల పిల్లలు 22.78 లక్షల మంది ఉన్నారని, 61 ఏళ్లు దాటినవారు 41.60 లక్షల మంది ఉన్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.

కాలేజీలో కరోనా కలకలం.. 14 మంది విద్యార్థులకు పాజిటివ్

కాలేజీలో కరోనా కలకలం.. 14 మంది విద్యార్థులకు పాజిటివ్

ఇది ఇలావుండగా, హైదరాబాద్ నార్సింగిలోని ఓ ప్రైవేటు కాలేజీలో 93 మంది విద్యార్థులకు ఆరోగ్య సిబ్బంది ర్యాపిడ్ టెస్టులు చేయగా, 14 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బుధవారం మరోసారి వీరికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని వైద్యారోగ్య అధికారులు తెలిపారు. కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరూ టెస్టులు చేసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+