దేశంలోనే తొలిసారిగా.. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పాలు పంపిణీ..
నేటి బాలలే రేపటి పౌరులు.. చిన్నారులను ఎదిగే వయసులో బలవర్థకమైన ఆహారం, మినరల్స్, పోషకాలతో కూడిన ఆహారం అందిస్తేనే వాళ్లు దృఢంగా తయారు అవుతారు. ముఖ్యంగా 5 ఏళ్ల లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపం ఎక్కువగా కనిపిస్తోంది. పౌష్టికాహార లోపం ఉన్న బాలబాలికలు.. ఎత్తుకు తగిన బరువు పెరగరు.. అలాగే వయసుకు తగిన ఎత్తూ పెరగరు. అంతేకాక తరచూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే రాష్ట్రంలోని చిన్నారులకు పౌష్టికాహారం అందించి వారిని ఆరోగ్యవంతంగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన విజయ పాలను పంపిణీ చేయనుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కార్యక్రమాన్ని ములుగు జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రారంభించింది.
రాష్టంలోని బాలబాలికల్లో పెరుగుతున్న పౌష్టికాహార లోపాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు నాణ్యమైన విజయ పాలను అందించనుంది. పైలెట్ ప్రాజెక్ట్ గా ములుగు జిల్లాలో తాజాగా ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. పౌష్టికాహార లోపం లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా తెలంగాణా రాష్ట్ర మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దానసరి అనసూయ(సీతక్క) ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అందులో భాగంగానే ప్రీస్కూల్ చిన్నారులకు 100 మి.లీ పాలు పంపిణీ చేశారు. ఇక్కడి ఫలితాన్ని బట్టి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క.. తెలంగాణ రాష్ట్రాన్ని పోషకాహార లోప రహిత తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని తెలిపారు. అందులో భాగంగానే ఎక్కువగా వెనుకబాటుతనంతో ఉన్న ములుగు జిల్లాను ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి అంగన్వాడీ టీచర్లు క్రియాశీల పాత్ర వహించాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారుల తల్లితండ్రులను కలిసి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరించాలని సూచించారు. అలాగే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మన అంగన్వాడీ కేంద్రాలు పనిచేసేలా అంగన్వాడీలు అంకితభావంతో కృషి చేయాలన్నారు.

అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తల్లితండ్రులను ఎవరైతే పిల్లలు నిర్లక్ష్యం చేస్తారో వారి నుండి ఆస్తులను జప్తుచేసి తల్లితండ్రుల మీద మార్పిడి చేయడం జరుగుతుందని వివరించారు. అనంతరం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ మరియు బాలి వివాహాలపై ఏర్పాటుచేసిన పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బాల్యవివాహాలు పిల్లల అభివృద్ధికి విఘాతం అని, బాల్య వివాహాలను అడ్డుకుని ములుగు జిల్లాను బాల్యవివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ విషయంలో CDPO లు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఇతరులు కృషిచేయాలని సూచించారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications