తెలంగాణలో 100కు తగ్గిన కొత్త కరోనా కేసులు: 17 జిల్లాల్లో సున్నా కేసులు, మరణాల్లేవ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. అయితే, ఒక్కోరోజు కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 23,888 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 105 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా, నమోదైన 105 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,73,574కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3973గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 529 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 106 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,65,861కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,740 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.85 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.
Recommended Video
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 03, భద్రాద్రి కొత్తగూడెంలో 00, జీహెచ్ఎంసీలో 59. జగిత్యాలలో 01, జనగామలో 00, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 05, ఖమ్మంలో 01, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 01, మహబూబాబాద్‌లో 01, మంచిర్యాలలో 01, మెదక్‌లో 00, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 06, ములుగులో 00, నాగర్ కర్నూలులో 00, నల్గొండలో 04, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 00, పెద్దపల్లిలో 00, రాజన్న సిరిసిల్లలో 00, రంగారెడ్డిలో 10, సంగారెడ్డిలో 02, సిద్దిపేటలో 02, సూర్యాపేటలో 00, వికారాబాద్ లో 00, వనపర్తిలో 02, వరంగల్ రూరల్‌లో 00, వరంగల్ అర్బన్‌లో 06, యాదాద్రి భువనగిరిలో 00 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 17 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.












Click it and Unblock the Notifications