పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.ఆ నిబంధన సడలింపు
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఈనెల 21(శుక్రవారం)వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2650 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు విద్యాశాఖ తెలిపింది. ఈ ఏడాది 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.వీరిలో బాలురు 2,58,895 మందికాగా.. బాలికలు 2,50,508 మంది ఉన్నారు.పరీక్షల నిర్వహణలో భాగంగా 2,650 మంది సీఎస్ లు, డీవోలను, 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
విద్యార్థులకు గుడ్ న్యూస్
గతంలో పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేవారు కాదు. అయితే ఈ నిబంధనను ప్రభుత్వం కొంతమేర సడలించింది. విద్యార్థులకు కొంత వెసులుబాటు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షరాసే విద్యార్థులకు గ్రేస్ పీరియడ్ ప్రకటించింది. దీని ద్వారా పరీక్ష టైం కంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అయితే విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఆలస్యంగా వెళ్లి టెన్షన్‌తో పరీక్ష రాసే కన్నా, అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుని ప్రశాంతంగా పరీక్ష రాయవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఈ పరీక్షలు ఆఫ్‌లైన్ మోడ్‌లో
పదో తరగతిలో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఎత్తివేసింది. ఇకపై విద్యాశాఖ 100 మార్కులకు ఫైనల్ పరీక్షలను నిర్వహించనుంది. 2024-25 విద్యా1 సంవత్సరం నుండి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు పదో తరగతి విద్యార్థులకు 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications