కిరోసిన్ పోసి నిప్పంటించిన బాలుడు మృతి(ఫోటోలు)

హైదరాబాద్: హైదరాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాలుడు ముస్తఫా గురువారం ఉదయం మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ముస్తఫాను తగులబెట్టిన ఘటనపై 3 ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి. దీంతో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్న మెహిదీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

బుధవారం మధ్యాహ్నం తర్వాత మెహిదీపట్నంలోని మిలిటరీ క్వార్టర్స్ పరిధిలో ముస్తఫాపై కిరోసిన్ పోసిన వ్యక్తులు అతడి ఒంటికి నిప్పు పెట్టారు. దీంతో 90 శాతం గాయాలైన ముస్తఫాను తొలుత ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని అపోలో ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన పోలీసులు, మిలిటరీ క్వార్టర్స్ ముందు భారీ సంఖ్యలో మోహరించారు. మిలిటరీ దుస్తుల్లో ఉన్న వ్యక్తులే తనను తగులబెట్టారని తన వాంగ్మూలంలో ముస్తఫా పేర్కొన్నాడు. అయితే ముస్తఫా ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని మిలిటరీ ఓ ప్రకటన చేసింది.

బాలుడుపై కిరోసిన పోసిన ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని మిలటరీ అధికారులు స్ఫష్టం చేశారు. సంఘటన జరిగిన సమయంలో మిలటరీ అధికారులు ఎవరూ అక్కడ లేరని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని మిటలరీ అధికారులు తెలిపారు. బాలుడుని మిలటరీ అధికారులు కిరోసిన్ పోసి నిప్పంటించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ మెహిదీపట్నం బాలుడు ముస్తఫా మృతి

చికిత్స పొందుతూ మెహిదీపట్నం బాలుడు ముస్తఫా మృతి

మెహిదీపట్నం రైతుబజారు ఎదురుగా మిలటరీ ప్రాంతం ఉంది. ఆ సమీపంలోనే సిద్దిఖీనగరలో నివసించే ముఖీబ్ కుమారుడు సయ్యద్ ముస్తపా(11), బుధవారం మధ్యాహ్నాం బాలుడి కేకలు వినిపించడంతో స్దానికులు అక్కడికి పరుగెత్తారు.

 చికిత్స పొందుతూ మెహిదీపట్నం బాలుడు ముస్తఫా మృతి

చికిత్స పొందుతూ మెహిదీపట్నం బాలుడు ముస్తఫా మృతి

మంటల్లో కాలిపోతున్న బాలుడిని గుర్తించి మంటలు ఆర్పగా, అప్పటికే శరీరం ముందు భాగమంతా కాలిపోయింది. పోలీసులకు సమాచారం అందించి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఉస్మానియా అసుపత్రికి తరలించారు.

 చికిత్స పొందుతూ మెహిదీపట్నం బాలుడు ముస్తఫా మృతి

చికిత్స పొందుతూ మెహిదీపట్నం బాలుడు ముస్తఫా మృతి

ఈ విషయం తెలుసుకున్న మేయర్ హూస్సేన్ మెట్రోపొలిస్ సదస్సు నుంచి నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి వచ్చారు.

 చికిత్స పొందుతూ మెహిదీపట్నం బాలుడు ముస్తఫా మృతి

చికిత్స పొందుతూ మెహిదీపట్నం బాలుడు ముస్తఫా మృతి

బాలుడి వాంగ్మూలం తీసుకోవాలని కోరడంతో... హైదరాబాద్ ఆర్డీవో నవ్వ, 15వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్టేట్ బి.శ్రీనివాసులు ఆసుపత్రికి వచ్చి బాలుడి వాంగ్మూలం తీసుకున్నారు.

 చికిత్స పొందుతూ మెహిదీపట్నం బాలుడు ముస్తఫా మృతి

చికిత్స పొందుతూ మెహిదీపట్నం బాలుడు ముస్తఫా మృతి

తాను ఆడుకుంటుండగా ఇద్దరు జవాన్లు పిలిచి పేరు అడిగారని, ఆ తర్వాత కిరోసిన పోశారని, పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని అగ్గిపుల్లతో అంటించారని తన వాంగ్మూలంలో వివరించాడు. సిద్దిఖీనగర్ నుంచి వచ్చిన స్దానికులు, మహిళలు ఉస్మానియా ప్రాంగణంలో అందోళనకు దిగారు.

 చికిత్స పొందుతూ మెహిదీపట్నం బాలుడు ముస్తఫా మృతి

చికిత్స పొందుతూ మెహిదీపట్నం బాలుడు ముస్తఫా మృతి

అనంతరం మెరుగైన చికిత్స కోసం కంచన్‌బాగ్ లోని అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలించారు. మోకాలి పై భాగం నుంచి ఛాతి వరకూ మందువైపు పూర్తిగా కాలిపోయిందని, కాలేయం, గుండె వంటి కీలక అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+